Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోబో 'స్పైడర్' కనిపించదు.. డబుల్ యాక్షన్ చేయలేదు: ప్రిన్స్

ప్రిన్స్ మహేష్ బాబు, ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం "స్పైడర్". ఈ చిత్రం బుధవారం ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రం టీజర్ ఇటీవలే విడుదల చేశారు. ఈ టీజర్‌లో కనిపి

Webdunia
మంగళవారం, 26 సెప్టెంబరు 2017 (09:59 IST)
ప్రిన్స్ మహేష్ బాబు, ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం "స్పైడర్". ఈ చిత్రం బుధవారం ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రం టీజర్ ఇటీవలే విడుదల చేశారు. ఈ టీజర్‌లో కనిపించే రోబో 'స్పైడర్' చిత్రంలో ఉండదట. ఈ విషయాన్ని హీరో మహేష్ బాబు బహిర్గతం చేశాడు. 
 
ఈ చిత్రం టీజర్ మీకు గుర్తుందా? మహేష్ బాబు సీరియస్‌గా తన పని చేసుకుంటూ వెళుతుంటే, ఓ రోబో స్పైడర్ మెల్లగా ఆయన కాలు పట్టుకుని పైకి ఎక్కి, భుజంపై చేరి డిస్ట్రబ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు మహేష్ దాన్ని 'ష్...' అని హెచ్చరిస్తే, తోక ముడుచుకుని కూర్చుంటుంది. 
 
అయితే, వాస్తవానికి సినిమాలో ఈ 'స్పైడర్' కనిపించదట. సినిమా కాన్సెప్ట్‌ను చూపించేందుకే ఆ టీజర్‌ను షూట్ చేశామని చెప్పాడు. చిత్రంలో తాను ఐబీ అధికారిగా పనిచేశానని చెప్పాడు. ఈ చిత్రంలో తాను డబుల్ యాక్షన్ చేశానని వచ్చిన వార్తలు అవాస్తవమని, అటువంటిది ఉంటే ట్రయిలర్‌లో చూపించే వాళ్లమని చెప్పాడు. 
 
ఇకపోతే.. 'స్పైడర్'లో నటించడం తనకెంతో కొత్త అనుభవాన్ని ఇచ్చిందని, వేర్వేరు నటులతో తెలుగు, తమిళ భాషల్లో చిత్రం ఒకేసారి చిత్రీకరించడం వల్ల, తాను గంటల వ్యవధిలో తెలుగు, తమిళం మాట్లాడుతూ ఉండాల్సి వచ్చేదని చెప్పాడు. ఇక తన తదుపరి చిత్రం 'భరత్ అను నేను'లో చాలా సులభంగా నటించేస్తున్నానని మహేష్ బాబు చెప్పాడు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments