Webdunia - Bharat's app for daily news and videos

Install App

''స్పైడర్'' మూవీ సెట్స్‌లో సితార, నమ్రత.. మగధీర టీమ్‌తో విదేశాల్లో గ్రాఫిక్స్ పనులు (ఫోటోలు)

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు తాజా సినిమా స్పైడర్ మూవీ సెట్స్‌లో ఆయన భార్య, నటీమణి నమ్రత శిరోద్కర్, ఆయన కుమార్తె సితార సందడి చేశారు. షూటింగ్ స్పాట్‌లో మహేష్ బాబు సితారతో గడిపిన సమయాన.. నమ్రత కొన్ని ఫోటోలు తీశారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల

Webdunia
మంగళవారం, 11 జులై 2017 (13:09 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు తాజా సినిమా స్పైడర్ మూవీ సెట్స్‌లో ఆయన భార్య, నటీమణి నమ్రత శిరోద్కర్, ఆయన కుమార్తె సితార సందడి చేశారు. షూటింగ్ స్పాట్‌లో మహేష్ బాబు సితారతో గడిపిన సమయాన.. నమ్రత కొన్ని ఫోటోలు తీశారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాగా 2000 నుంచి ప్రేమలో పడిన మహేష్ బాబు- నమ్రత.. 2005లో వివాహం చేసుకున్నారు. మహేష్- నమ్రత దంపతులకు గౌతమ్ కృష్ణ (11), సితార (5) అనే ఇద్దరు సంతానం ఉన్నారు. ప్రస్తుతం మహేష్ బాబు స్పైడర్ సినిమా షూటింగ్ పనుల్లో బిజీ బిజీగా ఉన్నాడు. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ షూటింగ్ స్పాట్‌లో నమ్రత, సితారలు ప్రిన్స్‌ను కలిసిన ఫోటోలను నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. 
 
మరోవైపు స్పైడర్ సినిమాకి సంబంధించిన ఒక పాట మాత్రమే పెండింగ్ వుంది. వచ్చేనెల మొదటివారంలో ఆ పాటను చిత్రీకరించడానికి ప్లాన్ చేశారు. ప్రస్తుతం గ్రాఫిక్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. భారత్‌తో పాటు యూకేలో వీఎఫ్ఎక్స్ పనులు జోరుగా జరుగుతున్నాయి. ఇక 'మగధీర' సినిమాకి పనిచేసిన ఇరాన్ టీమ్ వారు కూడా 'స్పైడర్' కోసం ప్రత్యేకంగా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది.

హాలీవుడ్ గ్రాఫిక్స్ ప్రమాణాలకు ధీటుగా స్పైడర్ సినిమా పనులు జరుగుతున్నాయని సమాచారం. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాక దసరాకు ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధమవుతుంది.


























































 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments