Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొరటాల శివ తదుపరి ప్రాజెక్టు సిద్ధం.. హీరో ఎవరో తెలుసా?

హ్యాట్రిక్ హిట్లతో జోరుమీదున్న డైరెక్టర్ కొరటాల శివ తన తదుపరి ప్రాజెక్టును సిద్ధం చేసుకున్నారు. ఇందులో మెగా ఫ్యామిలీ హీరో నటించనున్నారు. ఆ హీరో ఎవరో కాదు.. రాం చరణ్. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్, మ

Webdunia
మంగళవారం, 11 జులై 2017 (12:58 IST)
హ్యాట్రిక్ హిట్లతో జోరుమీదున్న డైరెక్టర్ కొరటాల శివ తన తదుపరి ప్రాజెక్టును సిద్ధం చేసుకున్నారు. ఇందులో మెగా ఫ్యామిలీ హీరో నటించనున్నారు. ఆ హీరో ఎవరో కాదు.. రాం చరణ్. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై తెరకెక్కించనున్నారు.
 
కాగా, చెర్రీ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్‌లో ‘రంగస్థలం 1985’ అనే సినిమాలో నటిస్తున్నారు. సమంత హీరోయిన్. అయితే.. ఈ చిత్రం తర్వాత చెర్రీ మణిరత్నం సినిమాలో నటించబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. కానీ, మణిరత్న దర్శకత్వంలో చేయడం లేదని ఇపుడు తేలిపోయింది. 
 
'రంగస్థలం' తర్వాత తీయబోయే సినిమా గురించి రామ్‌చరణ్ ప్రకటించారు. తన తదుపరి చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో ఉంటుందని తన ఫేస్‌బుక్‌ ఖాతాలో వెల్లడించారు. ఈ చిత్రం 2018 వేసవిలో సినిమాను ప్రారంభించబోతున్నట్టు తెలిపారు. కాగా, ఇదే విషయాన్ని రాంచరణ్ సతీమణి ఉపాసన తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. చెర్రీ ఫేస్‌బుక్ పోస్టును ట్వీట్ చేశారు. 
 
కొరటాల శివ మూడు వరుస సూపర్ డూపర్ హిట్లను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. 2013లో మిర్చి (ప్రభాస్), 2015లో శ్రీమంతుడు (మహేష్ బాబు), 2016లో జనతా గ్యారేజ్ (జూ.ఎన్టీఆర్) చిత్రాలు రిలీజై బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. అలాగే, 2018లో భరత్ అనే నేను చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రం తర్వాత చెర్రీ - కొరటాల కాంబినేషన్‌లో చిత్రం తెరక్కనుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

గెస్ట్ హౌసుల్లో అమ్మాయిలతో కొండా మురళి ఎంజాయ్ : ఆర్ఎస్ ప్రవీణ్ (Video)

ఇదేం రిపోర్టింగ్ బ్రో, ఫెంగల్ తుపాను గాలుల్లో గొడుగు ఎగిరిపోతున్నా మైక్ పట్టుకుని...(Video)

పెళ్లయ్యాక మీరు చేసేది అదే కదా: విద్యార్థినిలపై ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులు

ఫెంజల్ తుపాను: కడపలో ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరిక, తిరుపతి నుంచి వెళ్లాల్సిన 4 విమానాలు రద్దు

అదానీ కంపెనీలో ఒప్పందాలు జగన్‌కు తెలియవా? పురంధేశ్వరి ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments