Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదో స్ఫూర్తిదాయకమైన చిత్రం.. సూర్య నటన అద్భుతం...(Video)

Webdunia
గురువారం, 19 నవంబరు 2020 (11:06 IST)
తమిళ హీరో సూర్య నటించిన తాజా చిత్రం "ఆకాశమే నీ హద్దురా"! డెక్కన్ ఎయిర్‌వేస్ అధినేత గోపీనాథ్ జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని నిర్మించారు. సుధ కొంగర ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, సూర్య తల్లిగా ఊర్వశి, హీరోయిన్‌గా అపర్ణా బాలమురళిలు అద్భుతంగా నటించారు. 
 
అయితే, ఈ చిత్రం ఓటీటీలో విడుదలై సరికొత్త రికార్డులు నెలకొల్పుతోంది. ఇప్పటికే రూ.100 కోట్లకు పైగా వసూలు చేసినట్టు సమాచారం. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. 
 
మధ్య తరగతి యువకుడు పేదల కోసం అతి తక్కువ ధరలకు విమాన ప్రయాణ సౌకర్యాన్ని ఎలా కల్పించేలా చేస్తాడన్న కథతో ఈ సినిమాను రూపొందించారు. ఇందులో సూర్య నటనకు మంచి మార్కులు పడుతున్నాయి. సుధా కొంగర దర్శకత్వ ప్రతిభను సినీ ప్రముఖులు ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు.
 
దీనిపై మహేశ్ బాబు స్పందిస్తూ.. 'ఆకాశం నీ హద్దురా స్ఫూర్తిదాయకమైన సినిమా. అద్భుత‌ దర్శకత్వం, అద్భుతమైన పెర్ఫామెన్స్‌, సూర్య గొప్పగా నటించాడు. చిత బృందం మొత్తానికి అభినందనలు' అంటూ మహేష్ బాబు ట్వీట్ చేశారు. 
 
ఇకపోతే, మహేశ్ ప్రశంసలపై  హీరో సూర్య స్పందిస్తూ.. తమ సినిమాపై ప్రశంసలు కురిపించిన మహేశ్‌కు ధన్యవాదాలు తెలిపాడు. మహేశ్ బాబు నటిస్తోన్న "సర్కారు వారిపాట" సినిమా కోసం ఎదురుచూస్తున్నామని పేర్కొన్నాడు.  

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్కూలు బ్యాగు తగిలించుకుని కుర్చీలో కూర్చున్నఫళంగా గుండెపోటుతో 8 ఏళ్ల చిన్నారి మృతి (Video)

సారీ చెబితే తిరుపతి తొక్కిసలాటలో చనిపోయినవారు తిరిగొస్తారా? (video)

చెవిరెడ్డికి షాకిచ్చిన ఏపీ హైకోర్టు.. పోక్సో కేసు కొట్టివేతకు నిరాకరణ!

వెంటబడి కుక్కను తోలినట్లు సింహాన్ని తోలాడు, ఏం గుండెరా అతనిది (Video)

త్వ‌ర‌లో వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌ : ఏపీ సీఎస్ విజయానంద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

తర్వాతి కథనం
Show comments