Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళ సినీపరిశ్రమ ఇక నాదే - మహేష్‌

మహేష్‌ బాబేంటి.. తమిళ సినీపరిశ్రమలో నెంబర్ ఏంటి అనుకుంటున్నారా..? ఇప్పటికే విజయ్, సూర్య ఇలాంటి అగ్రహీరోలుంటే వారిని కాదని మహేష్ బాబు అగ్రస్థానంలోకి వెళ్ళడమేంటి.. బాష కన్నా కథ ముఖ్యం. సినిమా బాగుంటే ఏ

Webdunia
శుక్రవారం, 16 జూన్ 2017 (11:20 IST)
మహేష్‌ బాబేంటి.. తమిళ సినీపరిశ్రమలో నెంబర్ ఏంటి అనుకుంటున్నారా..? ఇప్పటికే విజయ్, సూర్య ఇలాంటి అగ్రహీరోలుంటే వారిని కాదని మహేష్ బాబు అగ్రస్థానంలోకి వెళ్ళడమేంటి.. బాష కన్నా కథ ముఖ్యం. సినిమా బాగుంటే ఏ బాషలోనైనా అభిమానులు ఆదరిస్తారని అందరికీ తెలిసిందే. అదే ఇప్పుడు ధీమాతో ఉన్నారు మహేష్. సినిమా రిలీజ్ కాకముందే తమిళ చిత్రసీమలో తాను నెంబర్ ఒన్ స్టాయికి ఎదిగిపోతానని స్నేహితులతో చెబుతున్నారట. అదే "స్పైడర్" సినిమా. హిట్ సినిమాల దర్శకుడు మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న 'స్పైడర్' సినిమాలో మహేష్ బాబు హీరో. ఈ సినిమా ఇప్పటికే దాదాపు పూర్తయ్యింది. కేవలం రెండు పాటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. సెప్టెంబర్ నెల సినిమా కూడా విడుదల కానుంది.
 
'బ్రహ్మోత్సవం' తర్వాత మహేష్ బాబు ఆచితూచి అడుగు వేస్తున్నారు. కథను ప్రధానంగా ఎంచుకుని డైరెక్టర్ గత సినిమాలను చూసిన తర్వాతనే సినిమాల్లో నటించడానికి ఓకే అంటున్నారు. అయితే మురుగదాస్ ఇప్పటికే హిట్ సినిమాలతో దూసుకుపోతున్నాడు. అందుకే నేరుగా మహేష్ మురుగదాస్‌ను కలిసి సినిమా తీద్దామని చెప్పారు. మహేష్‌తో సినిమా తీయడానికి సిద్ధమై సినిమాను ప్రారంభించి దాదాపు పూర్తి చేశారు మురుగదాస్. 
 
అంతా యాక్షన్‌ సినిమా టైప్‌లో ఉన్న 'స్పైడర్' సినిమా ఇప్పటికే అభిమానులను ఒక రేంజ్‌కు తీసుకెళ్ళింది. సినిమా ట్రైలర్ మహేష్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. స్రైడర్ సినిమాను తెలుగులోనే కాదు తమిళంలోను రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా తమిళంలో ఇప్పటికే 18 కోట్ల రూపాయల రైడ్స్ కొనుక్కున్నట్లు తెలుస్తోంది. గతంలో ఈ స్థాయిలో ఏ సినిమా ఇంత మొత్తంలో కొనుగోలు చేసుకున్న దాఖలాలు లేవు. అందుకే మహేష్‌ స్రైడర్ సినిమాతో తన రేంజ్ మారిపోతుందన్న ధీమాతో ఉన్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

అలాంటి రోగులకు కర్నాటకలో గౌరవంగా చనిపోయే హక్కు!!

ప్రియుడిని, కుమార్తెను మరిచిపోయిన ఎన్నారై మహిళ.. ఏమైందో తెలుసా?

ఏయ్ కూర్చోవయ్యా కూర్చో... ఇద్దరుముగ్గురు వచ్చి గోల చేస్తారు: సీఎం చంద్రబాబు అసహనం

Union Budget 2025: బుల్లెట్ గాయాలకు బ్యాండ్-ఎయిడ్ వేయడం లాంటిది.. రాహుల్ గాంధీ

పార్లమెంట్‌లో గురజాడ అప్పారావు ప్రస్తావన.. తెలుగు నేతల కితాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

తర్వాతి కథనం
Show comments