Webdunia - Bharat's app for daily news and videos

Install App

అపూర్వం... అనితర సాధ్యం.. బాహుబలి-2 సినిమా..1050 సెంటర్లలో 50 రోజులు

భారతీయ చలనచిత్ర చరిత్రలో ఇదొక చిరస్మరణీయ ఘట్టం. గత 85 సంవత్సరాల దేశీయ చలనచిత్ర పరిశ్రమ చరిత్రలో కనీ వినీ ఎరుగని ఘటనను నేటితో బాహుబలి-2 నమోదు చేసింది. ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా 9,500 థియేటర్లలో వి

Webdunia
శుక్రవారం, 16 జూన్ 2017 (09:31 IST)
భారతీయ చలనచిత్ర చరిత్రలో ఇదొక చిరస్మరణీయ ఘట్టం.  గత 85 సంవత్సరాల దేశీయ చలనచిత్ర పరిశ్రమ చరిత్రలో కనీ వినీ ఎరుగని ఘటనను నేటితో బాహుబలి-2 నమోదు చేసింది. ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా 9,500 థియేటర్లలో విడుదలై అన్ని రికార్డులను బద్దలు గొట్టిన బాహుబలి 2  విడుదలై ఈ శుక్రవారంతో 50 రోజులైంది. ఇప్పటికే రికార్డులు మీద రికార్డులు సాధించిన ఈ చిత్రరాజం మరో ఘనత సొంతం చేసుకుంది. దేశవ్యాప్తంగా 1050 సెంటర్లలో ఇంకా ‘బాహుబలి 2’  సినిమా ప్రదర్శితమవుతోంది. ఏ భారతీయ సినిమా రంగమైనా ఊహించడానికి వీలులేని రికార్డు ఇది. ఈ సందర్భంగా చిత్రయూనిట్‌ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది.
 
భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం నిలిచిన ‘బాహుబలి 2’  మున్ముందు మరిన్ని రికార్డులు సృష్టించనుంది. 50 రోజులు గడిచినా ఈ సినిమాకు ఆదరణ తగ్గకపోవడం విశేషం. త్వరలో చైనాతో పాటు మరికొన్ని దేశాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. దీంతో ఆల్‌టైమ్‌ రికార్డు కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచే అవకాశముందని మార్కెట్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రూ. 2 వేల కోట్లు సాధించే తొలి భారతీయ సినిమా అవుతుందని భావిస్తున్నారు.
 
తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరాదిలోనూ హైయ్యస్ట్ గ్రాస్ కలెక్షన్లు సాధించిన సినిమాగా రికార్డ్ సృష్టించిన బాహుబలి 2 ఇప్పటి వరకు రూ. 1650 కోట్లకు పైగా వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 200 కోట్ల రూపాయల కలెక్షన్ చేరువలో ఉన్న బాహుబలి 2 సినిమా ఒక్క హిందీ ప్రాంతంలోనే 510 కోట్లు ఆర్జించి అత్యద్భుత రికార్డు సృష్టించింది. 
 
కాగా, ఈ నెల 22న ప్రారంభం కానున్న మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో బాహుబలి 2ను ప్రారంభ చిత్రంగా ప్రదర్శించనుండటం విశేషం.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పేర్ని నానీ నీకంత కొవ్వు పట్టిందా? వల్లభేని వంశీని గుర్తు చేసుకో : సోమిరెడ్డి

సమోసా జిలేబీలపై చక్కెర, నూనె ఎంతుందో హెచ్చరించాలి.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ

Inter student : గుండెపోటుతో తెలంగాణ విద్యార్థి మృతి.. కారణం ఏంటంటే?

భార్యాభర్తల బంధం ఎంతగా బీటలు వారిందో తెలిసిపోతోంది : సుప్రీంకోర్టు

క్యాబ్‌లో వెళ్తున్న టెక్కీలకు చుక్కలు చూపించిన మందు బాబులు.. ఏం చేశారంటే? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

వాతావరణ మార్పులు నిశ్శబ్ద డిహైడ్రేషన్‌కి దారితీస్తోంది: వైద్యులు హెచ్చరికలు

తర్వాతి కథనం
Show comments