Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే స్టేజ్‌పై సందడి చేయనున్న మహేష్ బాబు-జూనియర్ ఎన్టీఆర్

Webdunia
శనివారం, 20 నవంబరు 2021 (19:37 IST)
junior ntr
సూపర్ స్టార్లు ప్రస్తుతం బుల్లితెరపై మెరవడం ఫ్యాషనైపోయింది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, టాలీవుడ్ మన్మథుడు నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ బుల్లితెరపై సందడి చేశారు. నాని కూడా బిగ్ బాస్ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా బుల్లితెరపై కనిపించేందుకు సిద్ధమవుతున్నాడు. 
 
ఇంకో విశేషం ఏమిటంటే... సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఒకే స్టేజ్‌పై సందడి చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ స్పెషల్‌ ఎపిసోడ్‌కు ప్రముఖ ఛానల్‌ భారీగా ప్లాన్‌ చేసినట్లు సమాచారం. 
 
ఆట నాది.. కోటి మీది అంటూ బుల్లితెర ప్రేక్షకులకు తారక్‌ చేరువయ్యారు. ఆయన హోస్ట్‌గా  ఎవరు మీలో కోటీశ్వరులు షో సాగుతోంది. ఈ షో ప్రారంభ ఎపిసోడ్‌లో రామ్‌చరణ్‌ సందడి చేయగా.. సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో రాజమౌళి, కొరటాల శివ సైతం తమ ఆటతో మెప్పించనున్నారు. 
 
అలాగే దసరా కానుకగా ప్రసారం కాబోతున్న  "ఎవరు మీలో కోటీశ్వరులు" కార్యక్రమంలో మహేశ్‌బాబు స్పెషల్‌గెస్ట్‌గా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ఎపిసోడ్‌ షూట్‌ జరగనుందని సమాచారం. దీంతో ఈ షో రేటింగ్ పెరిగే అవకాశం వున్నట్లు వార్తలు వస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డబ్బు కోసం బాయ్‌ఫ్రెండ్‌ను కిడ్నాప్ చేసిన ప్రియురాలు

ఏపీ మద్యం కేసు : అట్టపెట్టెల్లో దాచిన కరెన్సీ కట్టలు స్వాధీనం

రష్యా తీరంలో భారీ భూకంపం... సునామీ హెచ్చరికలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments