Webdunia - Bharat's app for daily news and videos

Install App

సితార పుట్టిన రోజు.. నిన్ను పది రెట్లు ప్రేమిస్తున్నాను.. మహేష్ బాబు

Webdunia
బుధవారం, 20 జులై 2022 (11:38 IST)
Sitara
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు గారాల పట్టి సితార సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందే సోషల్ మీడియా ద్వారా భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది. సోషల్ మీడియా వేదికగా ఈ అమ్మడు చేసిన సందడికి ఫాలోవర్స్ విపరీతంగా పెరిగారు. తాజాగా నేడు సితార బర్త్ డే సందర్భంగా ఆమె తండ్రి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.
 
సితార పదవ వసంతంలోకి అడుగుపెట్టిందంటూ ప్రిన్స్ వెల్లడించారు. "నా ప్రపంచంలో ప్రకాశవంతమైన నక్షత్రం సితారకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. నిన్ను పది రెట్లు ప్రేమిస్తున్నాను" అంటూ మహేష్ తన కామెంట్ సెక్షన్‌లో తెలిపారు. అలానే సితారకు పలువురు ప్రముఖులతో పాటు అభిమానులు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
 
కొన్ని చోట్ల సితార బర్త్ డే సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. మొత్తానికి సితార బర్త్ డే సందర్భంగా ఆమె పేరు ట్రెండింగ్‌లో నిలిచింది. గత కొంత కాలంగా సితార తెలుగు చిత్రసీమలో నటిగా అరంగేట్రం చేయనుందని ప్రచారం జరుగుతోంది. సర్కారు వారి పాట పెన్నీ అనే ప్రమోషనల్ సాంగ్‌లో సితార ఉండటంతో ఆమె అనుకున్న దానికంటే త్వరగా నటిగా అరంగేట్రం చేసే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విమానం కూలిపోతోందంటూ కేకలు.. ఒక్కసారిగా 900 అడుగుల కిందికి దిగిన ఫ్లైట్...

చక్కెర మిల్లులోకి వరద నీరు.. రూ.60 కోట్ల విలువ చేసే పంచదార నీటిపాలు

ఎఫైర్, ఆఖరుసారి కలుసుకుని ఆపేద్దాం అని పిలిచి మహిళను హత్య చేసిన ప్రియుడు

అమర్‌నాథ్ యాత్ర: నకిలీ యాత్ర కార్డుతో వ్యక్తి, అరెస్ట్ చేసిన పోలీసులు

కొత్త జీవితం కోసం వస్తే ఎడారి రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయారు.. విషాదాంతంగా ప్రేమజంట కథ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments