Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ‌హేష్ బాబు న్యూలుక్ లీక్ - సినిమా పేరు 'రైతుబిడ్డ' అంట

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు భ‌ర‌త్ అనే నేను సినిమాతో బ్లాక్‌బ‌ష్ట‌ర్ సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం త‌న 25వ సినిమా కోసం రెడీ అవుతున్నారు మ‌హేష్‌. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందే ఈ భారీ చిత్రాన్ని అశ్వ‌నీద‌త్, దిల్ రాజు సంయుక్తంగా న

Webdunia
గురువారం, 7 జూన్ 2018 (21:40 IST)
సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు భ‌ర‌త్ అనే నేను సినిమాతో బ్లాక్‌బ‌ష్ట‌ర్ సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం త‌న 25వ సినిమా కోసం రెడీ అవుతున్నారు మ‌హేష్‌. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందే ఈ భారీ చిత్రాన్ని అశ్వ‌నీద‌త్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో మ‌హేష్ స‌ర‌స‌న పూజా హేగ్డే న‌టిస్తోంది. రాక్ స్టార్ దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటోన్న ఈ సినిమా ఈనెల రెండో వారంలో సెట్స్ పైకి వెళ్ల‌నుంది. 
 
ఇదిలావుంటే... మ‌హేష్ బాబు 25వ సినిమాలో కొత్త గెట‌ప్ లో క‌నిపించ‌నున్నారని గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. తాజాగా మ‌హేష్ కొత్త ఫోటోలు లీక‌య్యాయి. ఈ ఫోటోల్లో ఉన్న మ‌హేష్ లుక్ తాజా చిత్రంలోనిది  అంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. రాయ‌ల‌సీమ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ చిత్రానికి రాజ‌సం అనే టైటిల్ అనుకుంటున్న‌ట్టు టాక్ వినిపించింది. 
 
తాజాగా రైతు బిడ్డ అనే టైటిల్ ప‌రిశీలిస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించే ఈ సినిమాలో అల్ల‌రి నరేష్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. మ‌రి...వైర‌ల్ అయిన ఫోటోలు మ‌హేష్ తాజా చిత్రంలోని గెట‌ప్పా కాదా అనేది తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భార్యతో విడాకులు ఇప్పించండి.. ఒమర్ : కూర్చొని మాట్లాడుకోండి.. సుప్రీం

3 నుంచి 5వేల సంవత్సరం మధ్యలో చంద్రుడు బూడిదవుతాడట, భయపెడుతున్న భవిష్యవాణి

మామిడి చెట్లకు వైభవంగా వివాహం.. జీలకర్ర, బెల్లం, మంగళసూత్రంతో.. ఎక్కడ?

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్‌‌గా బీఆర్ గవాయ్

75వ పుట్టినరోజు.. ఫ్యామిలీతో విదేశాలకు ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం
Show comments