Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ‌గాడికి శీలం పోతే! అదే క్యాలీ ఫ్లవర్ .సంపూర్ణేష్ బాబు

Webdunia
మంగళవారం, 16 నవంబరు 2021 (15:53 IST)
ఆశా జ్యోతి గోగినేని, వాసంతి, సంపూర్ణేష్ బాబు, ఆర్కే మలినేని
ఆడ‌వారికే శీలం గురించి చెబుతున్నాం. మ‌రి మ‌గాడికి లేదా? వుంటే దాన్ని ఎలా కాపాడుకోవాలి? అనే పాయింట్ న‌చ్చి క్యాలీ ఫ్లవర్ సినిమా చేశాన‌ని సంపూర్ణేష్ బాబు తెలియ‌జేస్తున్నాడు. ‘శీలో రక్షతి రక్షిత:’ అనేది ఉపశీర్షిక. గుడూరు శ్రీధర్‌ సమర్పణలో మధుసూదన క్రియేషన్స్, రాధాకృష్ణా టాకీస్‌ పతాకాలపై ఆశా జ్యోతి గోగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్కే మలినేని ఈ సినిమాకు దర్శకులు. ఈ చిత్రాన్ని నవంబరు 26న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు నిర్మాతలు. ఈ సందర్భంగా నేడు హైద్రాబాద్‌లో మీడియాతో చిత్రయూనిట్ ముచ్చటించింది.
 
హీరోయిన్ వాసంతి మాట్లాడుతూ.. ‘మొదటిసారిగా సంపూర్ణేష్ బాబుతో పని చేశాను. ఆయనెంతో మంచి వారు. డౌన్ టు ఎర్త్. ఎంతో సహకరించేవారు. నన్ను నమ్మి ఈ పాత్రను ఇచ్చినందుకు దర్శకుడికి థ్యాంక్స్. కెమెరామెన్ నన్ను చాలా అందంగా చూపించారు. ప్రజ్వల్‌ అద్భుతంగా సంగీతాన్ని అందించార‌ని అన్నారు.
 
సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ, మగాడు తన శీలాన్ని కాపాడుకుంటే దేశంలో ఎలాంటి నేరాలు జరగవు. ఒక మగాడి శీలం పోతే దాని కోసం చేసే పోరాటమే క్యాలీ ఫ్లవర్ కథ. శీలాన్ని కాపాడే శీల రక్షకుడే ఈ క్యాలీ ఫ్లవర్. నేను ఎన్ని సినిమాలు చేసినా కూడా హృదయకాలేయం, కొబ్బరిమట్ట, సింగం 123 లాంటి సినిమాలే గుర్తున్నాయి. ఇప్పుడు రాబోతోన్న క్యాలీ ఫ్లవర్ కూడా అదే కోవకు చెందుతుంది. సాయి రాజేష్ అన్న నన్ను ఈ స్థాయిలో నిలబెట్టాడు. ఆయనతో వర్క్ చేస్తే ఎలా అనిపించిందో.. ఈ మూవీ డైరెక్టర్ రాధా కృష్ణతో పని చేసినప్పుడు కూడా అలానే అనిపించింది. 
 
తన శాడిజాన్ని చూపించి.. నాలోంచి నటుడిని బయటకు తీసుకొచ్చి మిమ్మల్ని నవ్వించే ప్రయత్నమే ఈ క్యాలీ ఫ్లవర్. నిర్మాతలకు ఇది మొదటి సినిమా. అయినా కూడా కరోనా సమయంలో నిబంధనలు పాటిస్తూ సినిమాకు ఏం కావాలో అది సమకూర్చారు. కంటిన్యూగా 20 రోజులు షూట్ చేశాం. షెడ్యూల్ పూర్తి చేశాం. షూటింగ్ చేయడం ఒకెత్తు అయితే.. అందరికీ పని కల్పించడం మరో ఎత్తు. అందరూ హ్యాపీగా ఫీలయ్యారు. 
 
క్యాలీ ఫ్లవర్‌తో మనం కూర వండుకోవచ్చు. పచ్చడి చేసుకోవచ్చు. సాంబార్ చేసుకోవచ్చు. ఏదైనా చేసుకోవచ్చు. ఈ సినిమాలో కూడా అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. ఇది అద్భుతమైన సినిమా అవుతుంది. త్వరలోనే ఓ పాట రాబోతోంది. హీరో రేప్‌కు గురైన తరువాత వచ్చే పాట అది. అద్భుతంగా ఉంటుంది. సినిమా హిట్ అయితే దానికి కారణం మీరు (ఆడియెన్స్). తేడా కొట్టిందంటే అది నా వల్లే అని నేను మనస్ఫూర్తిగా తీసుకుంటాను. ఈ సినిమా గనుక హిట్ అయితే ఇంకో పది సినిమాలు రెడీగా ఉంటాయి. నా నుంచి ఏం కోరుకుంటున్నారో అది ఇచ్చే ప్రయత్నం చేశాం. నన్ను నమ్మండి. డేట్స్ కొంచెం అడ్జస్ట్ కాకపోవడంతో ఇలా కాస్త ముందుకు వస్తున్నాం. ఇది ఎంత వరకు రీచ్ అవుతుందో మాకు తెలియడం లేదు. మా ప్రయత్నం మేం చేస్తున్నాం. నవంబర్ 26న థియేటర్లోకి రాబోతోన్నాం. మీరందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎగ్జిట్ పోల్ ఫలితాలు 2024 : ఆ రెండు రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందంటే...

పెరుగుతున్న సముద్ర నీటి మట్టాలు.. ప్రమాదం ముంగిట తీర ప్రాంతాలు!

కారు యజమానిని వణికించిన కాకులు - వీడియో వైరల్

నేను తప్పు చేసానని తేలితే అరెస్ట్ చేస్కోవచ్చు: పోసాని కృష్ణమురళి

కట్టుకున్నోడికి పునర్జన్మనిచ్చిన అర్థాంగి.. కాలేయం దానం చేసింది.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments