Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రాండ్ న్యూ పోస్ట‌ర్‌తో‌`మాస్ట్రో`

Webdunia
బుధవారం, 21 ఏప్రియల్ 2021 (14:53 IST)
Nitin, naba natesh
హీరో నితిన్ కెరీర్‌లో మైల్‌స్టోన్ మూవీగా ‌మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న నితిన్ 30వ చిత్రం `మాస్ట్రో`. ఇటీవ‌లే విడుద‌లైన ఈ మూవీ ఫ‌స్ట్ లుక్‌, ఫ‌స్ట్ గ్లిమ్స్‌కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా శ్రీ‌రామ న‌వ‌మి శుభాకాంక్ష‌ల‌తో మాస్ట్రో మూవీ నుండి స‌రికొత్త పోస్ట‌ర్‌ని విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌.   నభా నటేష్ స్కూటీ నడుపుతూ ఉండగా..నితిన్ ఆమె వెనక కూర్చుని కలర్ ఫుల్‌గా ఉన్న ఈ రొమాంటిక్ పోస్ట‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది.
 
త‌మ‌న్నా భాటియా కీల‌క‌ పాత్రలో న‌టిస్తోన్న`మాస్ట్రో` 2021లో రూపొందుతోన్న క్రేజీ ప్రాజెక్టులలో ఒక‌టి. ఇటీవ‌ల రంగ్‌దే సినిమాతో విజ‌యం సాధించారు హీరో నితిన్‌. ఈ చిత్రంలో ఇద్దరు క్రేజీ హీరోయిన్స్ త‌మ‌న్నా భాటియా, న‌భా న‌టేష్ భాగ‌మ‌వుతున్నారు.  
 
'భీష్మ' మూవీకి సూప‌ర్ హిట్ మ్యూజిక్ ఇచ్చిన మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ ఈ చిత్రానికీ సుమ‌ధుర బాణీల‌ను స‌మ‌కూరుస్తున్నారు. రాజ్‌కుమార్ ఆకెళ్ల స‌మ‌ర్ప‌ణ‌లో శ్రేష్ఠ్ మూవీస్ ప‌తాకంపై ఎన్‌. సుధాక‌ర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తున్న ఈ మూవీకి జె. యువ‌రాజ్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.
ప్ర‌స్తుతం ఈ మూవీ చిత్రీక‌ర‌ణ చివరి ద‌శ‌లో ఉంది.
 
తారాగ‌ణం:
నితిన్‌, త‌మ‌న్నా భాటియా, న‌భా న‌టేష్‌, న‌రేష్‌, జిషుసేన్ గుప్తా, శ్రీ‌ముఖి, అన‌న్య‌, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్, ర‌చ్చ ర‌వి, మంగ్లీ, శ్రీ‌నివాస్ రెడ్డి.
 
సాంకేతిక బృందం:
మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం: మేర్ల‌పాక గాంధీ
నిర్మాత‌లు: ఎన్‌. సుధాక‌ర్ రెడ్డి, నికితా రెడ్డి
బ్యాన‌ర్‌: శ్రేష్ఠ్ మూవీస్‌
స‌మ‌ర్ప‌ణ‌: రాజ్‌కుమార్ ఆకెళ్ల‌
మ్యూజిక్‌: మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్‌
సినిమాటోగ్ర‌ఫీ: జె. యువ‌రాజ్‌
ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌. శేఖ‌ర్‌
ఆర్ట్‌: సాహి సురేష్‌

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం కేసీఆర్

సెకీతో సౌర విద్యుత్ ఒప్పందంలో ఎలాంటి సంబంధం లేదు : బాలినేని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments