Webdunia - Bharat's app for daily news and videos

Install App

తలైవిని థియేటర్లలోనే విడుదల చేస్తాం .. కంగనా రనౌత్

Webdunia
బుధవారం, 21 ఏప్రియల్ 2021 (14:26 IST)
దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం తలైవి. ఏఎల్.విజయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టైటిల్ రోల్‌ను బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పోషించారు. ఏప్రిల్ 23వ తేదీన ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే, కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతితో చిత్రం విడుదల వాయిదా పడింది.
 
ఈ నేపథ్యంలోనే సినిమాపై పలు పుకార్లు షికారు చేస్తున్నాయి. నేరుగా ఓటీటీలోనే విడుదల చేసేందుకు దర్శకుడు ప్లాన్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలపై క్వీన్ కంగనా ఫైర్ అయింది. ఆ వ్యాఖ్యలపై ఆమె స్పష్టతనిచ్చింది. సినిమా థియేటర్లలో విడుదలైన తరువాతే ఓటీటీలోకి వస్తుందని తేల్చి చెప్పారు. 
 
'తలైవి తమిళ వెర్షన్ హక్కులను అమెజాన్ ప్రైమ్, హిందీ హక్కులను నెట్ ఫ్లిక్స్‌లు సొంతం చేసుకున్నాయి. దీనిని ఆసరాగా చేసుకుని బాలీవుడ్‌‌లోని కొందరు వ్యక్తులు సినిమాను నేరుగా ఓటీటీలోనే విడుదల చేస్తారంటూ కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 
 
వీరితో పాటు ప్రతి ఒక్కరికీ చెప్పేదేంటంటే, సినిమాను థియేటర్లలో రిలీజ్ చేశాకే ఓటీటీలోకి తీసుకొస్తాం. నిజమేంటో తెలుసుకోకుండా తప్పుడు కథనాలు ప్రచురించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం' అని ఆమె హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Daughters in law: మహిళ వార్త విన్న కొన్ని గంటలకే మామ గుండెపోటుతో మృతి

బీజేపీ జాతీయ అధ్యక్షురాలి రేసులో తెలుగు మహిళ!

తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించిన రష్యా.. మాస్కోలో కొత్త ఆఫ్ఘన్ రాయబారి...

లండన్‌లో జల్సాలు - పార్టీలో పాటలు పాడిన విజయ్ మాల్యా - లలిత్ మోడీ!

కోల్‌కతా న్యాయ విద్యార్థిని అత్యాచార కేసులో విస్తుపోయే నిజాలు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

తర్వాతి కథనం
Show comments