Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాలా గ్యాప్ తర్వాత ''లేడీ''గా వస్తోన్న మాధవీలత

Webdunia
సోమవారం, 7 డిశెంబరు 2020 (14:11 IST)
Lady
''నచ్చావులే'' ఫేమ్ మాధవీలత తాజాగా కొత్త సినిమాలో నటిస్తోంది. మాధవీలత ముఖ్య పాత్రలో మోనో డ్రామా పద్ధతిని అనుసరించి జీ.ఎస్‌.ఎస్‌.ఎస్‌.పి. కళ్యాణ్‌ డైరెక్షన్‌లో రూపొందుతున్న చిత్రం ''లేడీ'. ఈ సినిమా తాజాగా షూటింగ్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. 
 
ఈ సందర్భంగా నిర్మాత, దర్శకుడు మాట్లాడుతూ, 'ఒకే ఒక క్యారెక్టర్‌తో ఈ సినిమా మొత్తాన్ని తెరకెక్కిస్తున్నాం. సినిమా ఆద్యంతం సస్పెన్స్‌గా ఉంటూ ప్రేక్షకులకు థ్రిల్‌ కలిగిస్తుంది. ప్రతి ఎపిసోడ్‌లో ప్రేక్షకుడు తనని తాను చూసుకుంటాడు. నటి మాధవీలత ఈ పాత్ర చేయడానికి అంగీకరించడం ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఆమె చాలా గ్యాప్‌ తరువాత సినిమాలో నటించడం విశేషం.
 
కాగా మాధవీ లత.. తనీష్ హీరోగా రవిబాబు దర్శకత్వంలో వచ్చిన నచ్చావులే సినిమాతో తెలుగు తెరకు పరిచమైంది. ఆ తర్వాత 'స్నేహితుడా' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. అలా కొన్ని సినిమాల్లో నటించిన మాధవీ లత ఆ తర్వాత తెలుగు సినిమాల నుంచి కొంత విరామం తీసుకుని ఏపీ రాజకీయాల్లోకి సంగతి తెలిసిందే. బీజేపీ టికెట్‌పై జనరల్ ఎలక్షన్స్‌లో గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసిన మాధవీ లత చాలా రోజుల తర్వాత లేడీ సినిమాను చేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో మహిళ హత్య

Pankaja Sri: వంశీకి హైపోక్సియా ఉంది.. జైలులో వుండలేరు.. భార్య పంకజ శ్రీ

అమర్నాథ్ యాత్ర కోసం 3 లక్షల 60 వేల మంది భక్తులు రిజిస్ట్రేషన్, యుద్ధమేఘాల మధ్య సాధ్యమేనా?

బీజేపీ నేత సుజనా చౌదరికి తీవ్ర గాయాలు... ఎలా?

ఒకే ఒక్క దెబ్బకి గోడకి కరుచుకున్నాడు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments