Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

షూటింగ్ పూర్తిచేసుకున్న మాధవి లత "లేడీ"

షూటింగ్ పూర్తిచేసుకున్న మాధవి లత
, ఆదివారం, 6 డిశెంబరు 2020 (20:47 IST)
ప్రముఖ హీరోయిన్ మాధవి లత పేరు ఈమ‌ద్య కాలంలో బాగా నోటెడ్ అయ్యిన విష‌యం తెలిసిందే. త‌ను చాలా గ్యాప్ త‌రువాత సోలో పెర్ఫార్మన్స్‌లో మోనో ప్లే పద్ధతిని అనుసరించి జీఎస్ఎస్ఎస్‌పి కళ్యాణ్ డైరెక్షన్‌లో రోపొందుతున్న రియల్ లైఫ్ థ్రిల్లింగ్ ఎమోషనల్ డ్రామా "లేడీ షూటింగ్ కార్యక్ర‌మాలు పూర్తిచేసుకుంది. ఈ మోనో ప్లే ఎక్సపెరిమెంటల్ మూవీని ఛరన్స్ క్రియేషన్స్, జీఎస్‌ఎస్‌ఎస్‌పీకే స్టూడియోజ్ బ్యానెర్లుపై సత్యనారాయణ గొరిపర్తి, జీ‍ఎస్ఎస్ఎస్‌ పి.కళ్యాణ్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 
 
నిర్మాత ద‌ర్శ‌కుడు జిఎస్ఎస్‌పి క‌ళ్యాణ్ మాట్లాడుతూ, ఒకే ఒక క్యారెక్టర్ తో ఈ సినిమా తెర‌కెక్కిస్తున్నాము. సినిమా ఆద్యంతం స‌స్పెన్స్‌గా థ్రిల్ క‌లిగిస్తుంది. ప్ర‌తి ఎపిసోడ్‌లో ప్రేక్ష‌కుడు త‌న‌ని తాను చూసుకుంటాడు. ఎమెష‌నల్‌గా తీర్చిదిద్దాము. మాద‌విల‌త ఈ పాత్ర‌కి అంగీక‌రించ‌డం ఈ చిత్రంపై అంచ‌నాలు పెరిగాయి. చాలా గ్యాప్ త‌ర్వాత సినిమాలో న‌టించ‌డం విశేషం. 
 
ఏ ఆశ లేకుండా ఈ లోకంలోకి క‌ళ్ళు తెరిచి వ‌చ్చిన మ‌నిషి త‌న చూట్టూ అల్లుకుపోయిన ఎమెష‌న్‌, ప్రేమ‌లు, ద్వేషాలు, క‌ప‌ట‌నాట‌కాలు, స్వార్థం క‌ళ్ళ‌‌ల్లో క‌నిపించ‌నివ్వ‌కుండా మ‌నసులోని దాచుకునే స్వ‌భావాలు క‌ళ్ళు మూసిన వెంట‌నే కార్చే క‌న్నీళ్ళు ఇదే జీవితం అని తెలుసుకున్న ఒ అబ‌ల క‌థ‌. వాస్త‌వ సంఘ‌ట‌న‌ల నుండి ఈ క‌థ‌ని రెడి చేశాను. 
 
అంతే అద్భుతంగా తెర‌కెక్కించాను. అందర్ని ఆక‌ట్ట‌కొవ‌ట‌మే కాదు గుండెలు బరువెక్కువ‌య్యేలా ఈ చిత్ర క‌థ‌నం వుండ‌బోతుంది. ఇలాంటి మంచి చిత్రానికి ద‌ర్శ‌కుడుగా నేను గర్వ‌ప‌డుతున్నాను. ఈ చిత్రం షూటింగ్ పూర్త‌య్యింది. త్వ‌ర‌లో సంగీతాన్ని విడుద‌ల చేసి సినిమాని 2021లో విడుదల చేయ‌టానికి స‌న్నాహ‌లు చేస్తున్నాను అని చెప్పుకొచ్చారు. 
      
తారాగణం : మాధవి లత 
సాంకేతిక వర్గం 
బ్యానర్ : చరణ్స్‌ క్రియేషన్స్ & జి ఎస్ ఎస్ ఎస్ పీ కే స్టూడియోజ్ 
కథ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే,  డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, వి ఎఫ్ ఎక్స్, డిఐ, పబ్లిసిటీ డిజైన్స్ : జీ ఎస్ ఎస్ ఎస్ పీ కళ్యాణ్ 
మ్యూజిక్ : వినోద్ యాజమాన్య 
పి ఆర్ ఓ : ఏలూరు శ్రీను 
ఎక్క్యూటివ్ ప్రొడ్యూసర్ : వేణు కార్తికేయన్ 
ప్రొడ్యూసర్స్ : జీ ఎస్ ఎస్ ఎస్ పి కళ్యాణ్, సత్యనారాయణ గొరిపర్తి

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐఎండీబీలో "అల.. వైకుంఠపురమలో" రికార్డు