Webdunia - Bharat's app for daily news and videos

Install App

చికాగో స్కామ్- ఓసారి అమెరికా వెళ్తే.. పాస్‌పోర్టును పరుపుకింద దాచుకున్నా

చికాగో సెక్స్ రాకెట్ కేసులో నిందితులైన మోదుగుమూడి కిషన్ ఆయన భార్య చంద్రకళలను ఫెడరల్ పోలీసులు గురువారం ఇల్లినాయిస్ డిస్ట్రిక్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచనున్నారు. ఈ దంపతులు అమెరికాలో అక్రమంగా నివాసం ఉ

Webdunia
గురువారం, 21 జూన్ 2018 (11:33 IST)
చికాగో సెక్స్ రాకెట్ కేసులో నిందితులైన మోదుగుమూడి కిషన్ ఆయన భార్య చంద్రకళలను ఫెడరల్ పోలీసులు గురువారం ఇల్లినాయిస్ డిస్ట్రిక్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచనున్నారు. ఈ దంపతులు అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్నారని పోలీసులు అదుపులోకి తీసుకోగా,  పోలీసులకు దొరికిన ఓ చిత్తుకాగితం, భారీ సెక్స్ రాకెట్‌ బాగోతాన్ని బయటపెట్టింది. 
 
దీంతో ప్రస్తుతం అమెరికాలోని తెలుగు సంఘాల చరిత్రను తవ్వితీస్తున్నారు. ఇప్పటికే అమెరికా వెళ్లి, వ్యభిచారం చేశారన్న అనుమానాలున్న హీరోయిన్లను ప్రశ్నించిన అమెరికా పోలీసులు, మొత్తం విచారణ పూర్తి కావడానికి నెల రోజుల సమయం పడుతుందంటున్నారు. 
 
అలాగే హీరోయిన్ల బ్యాంకు ఖాతాలను, ఎయిర్ పోర్టులో జరిపిన ఫారెక్స్ లావాదేవీలను పరిశీలిస్తున్నారు. దీంతో తమ బ్యాంకు ఖాతాల్లోకి డాలర్లను వేయించుకున్న హీరోయిన్లు, తిరిగి వచ్చే వేళ డాలర్లను రూపాయల్లోకి మార్చుకున్న హీరోయిన్లు ఈ కేసులో ఇబ్బందులు పడక తప్పదని లాయర్లు అభిప్రాయపడుతున్నారు. 
 
మరోవైపు టాలీవుడ్‌ని కుదిపేస్తున్న చికాగో సెక్స్ రాకెట్‌పై మాధవీలత నోరు విప్పింది. గత ఏడాది అమెరికా వెళ్లిన నేపథ్యంలో తనకు ఎదురైన అనుభవాన్ని మాధవీలత వివరించింది. తాను 2017లో ఓ ఈవెంట్ కోసం అమెరికాకు వెళ్లానని మాధవీలత తెలిపింది. 
 
ఈవెంట్ కోఆర్డినేటర్లుగా కిషన్, చంద్ర ఉన్నారని తెలిపింది. అక్కడ జరుగుతున్న పరిణామాల అనుమానంగా ఉండడంతో తన జాగ్రత్తల్లో తాను ఉన్నానని మాధవీలత తెలిపింది. చంద్రకళ, కిషన్ హౌస్ తనను 20 రోజుల పాటు అరెస్ట్ చేశారని.. తీవ్రమైన మెడనొప్పి వున్నా చికిత్స చేయించలేదని చెప్పింది. వారం రోజుల పాటు మందులు వాడాక ఇండియా తిరిగి వచ్చానని మాధవీలత తెలిపింది.
 
ట్రాప్‌లోకి నటీమణులని దించి అమెరికాకు రప్పించి పాస్ పోర్ట్ లాగేసుకుని బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు తాను విన్నానని మాధవీలత తెలిపింది. తాను అమెరికాకు వెళ్లిన సమయంలో కూడా పాస్ పోర్ట్ పరుపుకింద దాచుకునేదాన్ని అని మాధవీలత తెలిపింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మాదాపూర్ బార్ అండ్ రెస్టారెంట్‌‌లో అగ్నిప్రమాదం... (video)

KTR: కేటీఆర్‌‌కు ఓ స్వీట్ న్యూస్ ఓ హాట్ న్యూస్.. ఏంటది?

గంటలో శ్రీవారి దర్శనం.. ఎలా? వారం రోజుల పాటు పైలెట్ ప్రాజెక్టు!

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం... ఉత్తారంధ్రకు భారీ వర్ష సూచన!

మీసాలు తిప్పితే రోడ్లు పడవు : మీ కోసం పని చేయనివ్వండి .. పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం