Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చికాగో రాకెట్‌పై శ్రీరెడ్డి, అనసూయ ఏమన్నారంటే..? వింటే షాకే?

అమెరికాలో తెలుగు హీరోయిన్లతో సెక్స్ రాకెట్‌పై వివాదాస్పద నటి శ్రీరెడ్డి స్పందించింది. తనకు ఆ సెక్స్ రాకెట్ నుంచి పిలుపు వచ్చిందని.. శ్రీరెడ్డి వెల్లడించింది. టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్‌పై పోరాటం చేస

Advertiesment
Anchor Anasuya
, ఆదివారం, 17 జూన్ 2018 (12:19 IST)
అమెరికాలో తెలుగు హీరోయిన్లతో సెక్స్ రాకెట్‌పై వివాదాస్పద నటి శ్రీరెడ్డి స్పందించింది. తనకు ఆ సెక్స్ రాకెట్ నుంచి పిలుపు వచ్చిందని.. శ్రీరెడ్డి వెల్లడించింది. టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్‌పై పోరాటం చేస్తున్న శ్రీరెడ్డి ఈ ఘటనపై స్పందిస్తూ.. అమెరికాలో తెలుగు హీరోయిన్లతో మోదుగుమూడి కిషన్ అలియాస్ శ్రీరాజు, చంద్రకళ దంపతులు అరెస్టు కావడంపై శ్రీరెడ్డి స్పందిస్తూ.. చిత్ర పరిశ్రమలో అవకాశాలు లభించని ఆర్టిస్టులు నృత్య ప్రదర్శనలు, వివిధ షోల పేరిట అమెరికాకు వెళుతుంటారని చెప్పింది.
 
అక్కడ వారితో వ్యభిచారం చేయిస్తుంటారని, ఒక్కో హీరోయిన్‌కు ఉండే పాప్యులారిటీని బట్టి డబ్బులు అందుతుంటాయని శ్రీరెడ్డి షాకింగ్ నిజాన్ని వెల్లడించింది. కాసేపు గడిపినందుకు వీరికి 1000 డాలర్లకు పైగానే ముడుతుందని చెప్పింది. కిషన్ దంపతులు తనను కూడా అమెరికాకు రావాలని సంప్రదించారని, కానీ తాను వెళ్లలేదని శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది. 
 
ఇదే తరహా హాట్ యాంకర్ అనసూయకు కూడా అమెరికా నుంచి ఈ ఆఫర్ వచ్చిందని షాకింగ్ నిజం చెప్పింది. తెలుగు అసోసియేషన్ నిర్వహించే ఓ కార్యక్రమానికి హాజరు కావాలంటూ.. శ్రీరాజు అనే వ్యక్తి తనకు అమెరికా నెంబర్ నుంచి కాల్ చేయడాన్ని అనసూయ గుర్తు చేసుకుంది. అతను మాట్లాడే విధానం తనకు నచ్చకపోవడంతో అమెరికా కార్యక్రమానికి హాజరు కాలేనని.. శ్రీరాజు ఆఫర్‌ను తిరస్కరించినట్లు అనసూయ వెల్లడించింది. 
 
కానీ ఈవెంట్ పోస్టర్లో తన ఫోటో వేశారని, కానీ ఆ ఈవెంట్లో తాను పాల్గొనడం లేదని ట్విట్టర్ ద్వారా తెలియజేసినట్లు అనసూయ స్పష్టం చేసింది. చాలారోజులుగా తాను అమెరికా వెళ్లలేదని, 2014-16లో సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్‌తో కలిసి మ్యూజిక్ ప్రోగ్రామ్ కోసం అమెరికా వెళ్లినట్లు తేటతెల్లం చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కస్తూరిపై కేసు.. హిజ్రాలపై నోరు పారేసుకోవడంతో..?