Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటి హేమకు బిగ్ షాక్.. షోకాజ్‌ నోటీసులు జారీ

Webdunia
మంగళవారం, 10 ఆగస్టు 2021 (18:12 IST)
మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా) ఎన్నికలు.. రోజురోజుకు హీటెక్కుతున్నాయి. అధ్యక్ష పదవి కోసం బరిలోకి దిగిన ఐదుగురు అభ్యర్థులు.. ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ వార్తల్లో హాట్ టాపిక్‌గా మారుతున్నారు. ఈ క్రమంలోనే పోటీలో ఉన్న నటి హేమ.. ప్రస్తుత 'మా' ప్రెసిడెంట్‌ నరేశ్‌ నిధులను దుర్వినియోగం చేశారంటూ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
 
రూ.5 కోట్ల నిధుల్లో రూ.3 కోట్లు మాత్రమే మా అధ్యక్షుడు నరేశ్‌ ఇప్పటివరకు ఖర్చు చేశారని, మిగతా డబ్బంతా ఏమైందని హేమ సూటిగా నిలదీసింది. అయితే హేమ చేసిన వ్యాఖ్యలను ఖండించిన నరేశ్‌..అసోసియేషన్‌ గౌరవాన్ని దెబ్బతీసేలా ఆమె మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. అలాగే హేమపై క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేస్తామని.. కమిటీ నిర్ణయం ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
 
ఇందులో భాగంగానే హేమకు క్రమశిక్షణ సంఘం బిగ్ షాక్ ఇచింది. తాజాగా హేమకు క్రమశిక్షణ సంఘం షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. నరేష్‌పై చేసిన ఆరోపణలకు మరో మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరుతూ హేమకు నోటీసులు పంపారు. లేని పక్షంలో క్రమశిక్షణా సంఘం నుంచి కఠిన చర్యలు తప్పవని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Talakona: తలకోన సిద్ధేశ్వర స్వామి ఆలయంలో మెరుగైన సౌకర్యాలు

KPHB : వేశ్యతో గొడవ.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై కత్తితో దాడి

Bus crash: ఆప్ఘనిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. బస్సు- ట్రక్కు ఢీ.. 71మంది సజీవ దహనం

అన్నయ్యతో చెల్లెలు సంసారం.. ప్రెగ్నెంట్ కావడంతో భర్తకు డౌట్.. ఎందుకోసమంటే?

టీచర్‌ని ప్రేమించిన స్టూడెంట్.. చీర కట్టుకుని వచ్చింది.. పెట్రోల్ పోసి నిప్పంటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments