Webdunia - Bharat's app for daily news and videos

Install App

శివాజీరాజాపై సీనియర్ న‌రేష్ ఫైర్... అస‌లు ఏం జ‌రిగింది?

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు జ‌రిగిన‌ప్పుడు ఒక‌రిపై ఒక‌రు తీవ్ర స్ధాయిలో ఆరోప‌ణ‌లు చేసుకుని వార్త‌ల్లో నిలిచిన సినీ ప్ర‌ముకులు మ‌రోసారి వార్త‌ల్లో నిలిచారు. అసోసియేష‌న్ నిధులు దుర్వినియోగం జ‌రిగాయ‌ని సీనియ‌ర్ న‌టుడు, మా సెక్ర‌ట‌రీ న‌రేష్ ప్రె

Webdunia
మంగళవారం, 4 సెప్టెంబరు 2018 (09:51 IST)
మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు జ‌రిగిన‌ప్పుడు ఒక‌రిపై ఒక‌రు తీవ్ర స్ధాయిలో ఆరోప‌ణ‌లు చేసుకుని వార్త‌ల్లో నిలిచిన సినీ ప్ర‌ముకులు మ‌రోసారి వార్త‌ల్లో నిలిచారు. అసోసియేష‌న్ నిధులు దుర్వినియోగం జ‌రిగాయ‌ని సీనియ‌ర్ న‌టుడు, మా సెక్ర‌ట‌రీ న‌రేష్ ప్రెసిడెంట్ శివాజీరాజాపై  ఫైర్ అయ్యారు. గ‌త కొన్ని రోజులు నుంచి అసోసియేష‌న్‌లో విభేదాలు ఉన్నాయి. అయితే... ఇటీవ‌ల నిధులు దుర్వినియోగం ఆరోప‌ణ‌లు గురించి అత్య‌వ‌స‌ర స‌మావేశం ఏర్పాటు చేసుకున్నారు.
 
ఇది బ‌య‌ట‌కు రావ‌డంతో కొన్ని వార్త ప‌త్రిక‌ల్లోను, న్యూస్ ఛాన‌ల్స్‌లోను వ‌చ్చింది. దీంతో ప్రెసిడెంట్ శివాజీరాజా, ఎగ్జ‌క్యూటివ్ ప్రెసిడెంట్ హీరో శ్రీకాంత్, కోశాధికారి ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు ప్రెస్‌మీట్ పెట్టి... అసోసియేష‌న్ నిధులు దుర్వినియోగం జ‌రిగాయ‌ని నిరూపిస్తే.. ఆస్తి అంతా రాసి ఇచ్చేస్తాన‌ని శివాజీరాజా చెప్పారు. 
 
ఇక శ్రీకాంత్ అయితే... న‌రేష్‌కి ఫోన్ చేసి నిధులు దుర్వినియోగం జ‌రిగింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అందులో నా పేరు వ‌స్తుంది. దీనికి మీరు స‌మాధానం చెప్పాల‌ని అడిగితే స‌మాధానం చెప్ప‌లేదు. త‌న త‌ప్పు ఉంద‌ని నిరూపిస్తే అసోసియేష‌న్ నుంచి త‌ప్పుకుంటాన‌ని.. త‌న స‌భ్య‌త్వాన్ని క్యాన్సిల్ చేసుకుంటాన‌ని చెప్పారు. నా త‌ప్పు లేద‌ని తెలిస్తే మీరు అలా చేస్తారా..? అంటూ స‌వాల్ విసిరారు. 
 
దీనికి న‌రేష్ కౌంట‌ర్‌గా ప్రెస్ మీట్ పెట్టి.. అమెరికా ఈవెంట్‌ కోసం శివాజీరాజాతో సహా మరికొందరు బిజినెస్‌ క్లాస్‌లో 3 లక్షలు చెల్లించి మరీ ప్రయాణం చేశారని.. ఆ డబ్బంతా ఎవరిదంటూ ప్రశ్నించారు. తప్పు జరిగినందువల్లే తాను ఫారిన్‌ టూర్లకు వెళ్లడం లేదని ఆయన పేర్కొన్నారు. మా తరపున క్రికెట్‌ మ్యాచ్‌ నిర్వహించిన విషయం కూడా తనకు తెలియదని వాపోయారు. సెక్రటరీగా ఉన్న తనకు అసలు ఎటువంటి విలువ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తానికి నువ్వు త‌ప్పు చేసావంటే.. నువ్వు త‌ప్పు చేసావంటూ ఇండ‌స్ట్రీ ప‌రువు తీసేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Perni Nani: పేర్ని నాని భార్య జయసుధకు నోటీసులు..

Pawan Kalyan: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ప్రశంసల జల్లు

మరణశాసనం రాసిన మద్యంమత్తు!

జేజు ఎయిర్ విమాన ప్రమాదానికి కారణం ఏంటి?

స్పేడెక్స్ మిషన్: భారత్‌కు ఈ ప్రయోగం ఎందుకంత కీలకం?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

steps to control diabetes మధుమేహం అదుపుకి జాగ్రత్తలు ఇవే

Herbal Tea హెర్బల్ టీ హెల్త్ బెనిఫిట్స్

winter heart attack చలికాలంలో గుండెపోటుకి కారణాలు, అడ్డుకునే మార్గాలు

అరుదైన ఎక్స్‌ట్రాసోసియస్ ఆస్టియోసార్కోమాతో బాధపడుతున్న 18 ఏళ్ల బాలికకు ఏఓఐ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments