Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ప్రాంతీయవాదం'తో నిండిన "మా" సభ్యత్వం నాకొద్దు : నాగబాబు

Webdunia
సోమవారం, 11 అక్టోబరు 2021 (08:38 IST)
ప్రాంతీయవాదం, సంకుచిత మనస్తత్వంతో కొట్టుమిట్టాడుతున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యత్వం తనకు వద్దని మెగా బ్రదర్ నాగబాబు ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తన రాజీనామా లేఖను తన సిబ్బందితో 48 గంటల్లో మా కార్యాలయానికి పంపిస్తానని తెలిపారు. 
 
ఎంతో హోరాహోరీగా సాగిన మా ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడ్డాయి. హీరో మంచు విష్ణు 107 ఓట్ల మెజారిటీతో తన ప్రత్యర్థి ప్రకాశ్‌ రాజ్‌పై ఘనవిజయం సాధించారు. ప్రెసిడెంట్‌గా మంచు విష్ణు, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా శ్రీకాంత్, జనరల్‌ సెక్రటరీగా రఘుబాబు, ట్రెజరర్‌గా శివబాలాజీ గెలుపొందారు.
 
అయితే, ఆరంభం నుంచి ప్ర‌కాశ్ రాజ్‌కి గట్టిగా మద్దతునిస్తూ వచ్చిన ప్ర‌కాశ్‌రాజ్ ఓడిపోవ‌డంతో మెగా బ్ర‌ద‌ర్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. 'ప్రాంతీయవాదం మరియు సంకుచిత మనస్తత్వంతో కొట్టు మిట్టాడుతున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో కొనసాగడం ఇష్టం లేక మా అసోసియేషన్‌లో నా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను సెలవు' అంటూ నాగబాబు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
 
పైగా, తన రాజీనామాను 'మా' అసోసియేషన్‌కి 48 గంటల్లో తన స్టాఫ్ ద్వారా పంపుతాను అని తెలిపారు. ఇది ఎంతో ఆలోచించి, ప్రలోభాలకు అతీతంగా పూర్తి చిత్తశుద్దితో తీసుకున్న నిర్ణయం అని అన్నారు. నాగబాబు తీసుకున్న నిర్ణయం పట్ల అభిమానులు, నెటిజన్లు ప‌లు ర‌కాలుగా స్పందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతిని అలా నిర్మించనున్న సర్కారు.. ఎలాగో తెలుసా?

జానీపై సీరియస్ అయిన జనసేనాని.. సస్పెండ్ చేసిన పవన్

వైకాపా అధికార ప్రతినిధిగా యాంకర్ శ్యామల.. బాబు, పవన్‌లపై ఫైర్

లడ్డూ వేలం విజయవంతం.. సంతోషంలో డ్యాన్స్ చేసి కుప్పకూలిపోయాడు..

భూమి మీదికి కొత్త చంద్రుడు రాబోతున్నాడు, ఎన్ని రోజులు వుంటాడో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

గ్రీన్ టీ తాగితే కలిగే ప్రయోజనాలు, ఏంటవి?

భారతదేశంలో అవకాడో న్యూట్రిషనల్- ఆరోగ్య ప్రయోజనాలు తెలియచెప్పేందుకు కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ క్యాంపెయిన్

బ్యాక్ పెయిన్ సమస్యను వదిలించుకునే మార్గాలు ఇవే

తర్వాతి కథనం
Show comments