Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'మా' ట్రెజరర్‌గా శివబాలాజీ... ఆ విషయంలో విష్ణును ప్రకాష్ రాజ్ ఓడించారు..?!

Advertiesment
Siva Balaji
, ఆదివారం, 10 అక్టోబరు 2021 (22:08 IST)
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఈసీ ఓట్ల లెక్కింపు పూర్తి కాగా, ఆఫీస్ బేరర్ల ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఆఫీస్ బేరర్ల ఓట్ల లెక్కింపులో తొలి ఫలితం వెలువడింది. 'మా' కోశాధికారి (ట్రెజరర్)గా శివబాలాజీ విజయం సాధించారు. 
 
మంచు విష్ణు ప్యానెల్ కు చెందిన శివబాలాజీ... ప్రకాశ్ రాజ్ ప్యానెల్ కు చెందిన నాగినీడుపై నెగ్గారు. శివబాలాజీకి 316 ఓట్లు రాగా, నాగినీడుకు 284 ఓట్లు లభించాయి. ఇక, జీవితపై విష్ణు ప్యానెల్ అభ్యర్థి రఘుబాబు స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. జీవిత 'మా' ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేయడం తెలిసిందే.
 
మరోవైపు 18 మంది పోటీ చేసిన ఈసీ మెంబర్స్‌లో 11 మంది ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి గెలుపొందారు. ఈసీ మెంబర్స్ విషయంలో సభ్యులు ప్రకాష్ రాజ్‌ను నమ్మారు కానీ ప్రధానమైన పోటీలో మాత్రం అతడి వెంట నడవలేకపోయారు. ప్రకాష్ ప్యానెల్‌లో ఉన్న అనసూయ, కౌశిక్, శివా రెడ్డి లాంటి వాళ్లు విజయం సాధించారు. మరోవైపు విష్ణు ప్యానెల్ నుంచి కేవలం ఏడుగురు సభ్యులు మాత్రమే ఈసీ మెంబర్స్‌గా గెలిచారు.
 
ఈ విషయంలో విష్ణును ఓడించాడు ప్రకాష్ రాజ్. అదొక్కటే ఇప్పుడు ప్రకాష్ ప్యానెల్‌కు ఊరటనిచ్చే విషయం. అయితే ఈసీ మెంబర్స్ ఎక్కువగా ఉన్నంత మాత్రానా పెద్దగా లాభమేం లేదు. మరోవైపు ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి ఎగ్జిగ్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా సీనియర్ హీరో శ్రీకాంత్ గెలిచాడు. మిగిలిన వాళ్లంతా ఓటమి పాలయ్యారు. నాన్ లోకల్ ఇష్యూ ప్రకాష్ రాజ్ విషయంలో బాగా పని చేసింది. విష్ణు ఈ విషయాన్ని సభ్యులకు అర్థమయ్యేలా తీసుకెళ్ళడంలో సక్సెస్ అయ్యాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మా ఎన్నికల్లో మంచు విష్ణు జయకేతనం.. ప్రకాష్ రాజ్‌కు షాక్