Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నికల తేదీలపై క్లారిటీ లేని మా సమావేశం - ఎన్నికలపై భిన్న స్వరాలు

Webdunia
ఆదివారం, 22 ఆగస్టు 2021 (15:27 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన నటీనటుల సంఘమైన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) సర్వసభ్య సమావేశం ఆదివారం హైదరాబాదులో జరిగింది. ఇందులో ఎన్నికల తేదీపై ఎటూ తేల్చకుండానే సమావేశం ముగిసింది. 
 
ఈ సమావేశంలో 'మా' ఎన్నికలపై చర్చించినా, ఎన్నికలు ఎప్పుడు జరపాలన్నదానిపై సభ్యులు భిన్నాభిప్రాయాలు వెల్లడించారు. దీనిపై 'మా' క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కృష్ణంరాజు, మురళీమోహన్ స్పందించారు. వారం రోజుల్లో ఎన్నికల తేదీ నిర్ణయిస్తామని వెల్లడించారు.
 
మరోవైపు, 'మా' ప్రస్తుత అధ్యక్షుడు నరేశ్ మాట్లాడుతూ, ఎన్నికలు ఎంత త్వరగా జరిగితే అంత మంచిదని అభిప్రాయపడ్డారు. కొందరు సెప్టెంబరు, కొందరు అక్టోబరు అంటున్నారని వ్యాఖ్యానించారు. డీఆర్సీ కమిటీ ఎలా చెబితే అలా చేస్తానని నరేశ్ స్పష్టం చేశారు. 
 
అటు ప్రకాశ్ రాజ్ స్పందిస్తూ, వీలైనంత త్వరగా ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. 'మా' సర్వసభ్య సమావేశం జరిపిన 21 రోజుల్లోగా ఎన్నికలు జరపాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. సెప్టెంబరు 12న కాకుంటే సెప్టెంబరు 19న ఎన్నికలు జరపాలని సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జాబ్‌మేళాకు పోటెత్తిన నిరుద్యోగులు - తొక్కిసలాటలో ముగ్గురు గాయాలు (Video)

మురుగు కాలువలో మహిళ మృతదేహం - ముక్కుపుడకతో వీడిన మిస్టరీ!

వీధి కుక్కలపై అత్యాచారం చేసిన దుండగుడు.. చితక్కొట్టి పోలీసులకు అప్పగించారు..

బాపట్లలో రైల్వే విశ్రాంత ఉద్యోగితో వివాహేతర సంబంధం, పెట్రోలు పోసుకుని వాటేసుకుంది

దూడ కోసం సింహాలు వేట.. ఒంటరి పోరు చేసిన బర్రె.. తర్వాత ఏం జరిగిందంటే? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments