సత్యం రాజేష్, డా. కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రాకెండ్ మౌళి, బాలాదిత్య, సాహితి దాసరి, రవి వర్మ, చిత్రం శ్రీను ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం`మా ఊరి పొలిమేర-2` శ్రీకృష్ణ క్రియేషన్స్ బేనర్ పై గౌరు గణబాబు సమర్పణలో గౌరికృష్ణ నిర్మిస్తున్నారు. డా.అనిల్ విశ్వనాథ్ దర్శకుడు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెలాఖరులో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ...``సత్యం రాజేష్ నాకు మంచి మిత్రుడు. ఓటీటీలో తను నటించిన `మా ఊరి పొలిమేర` చూశాను. నాకు చాలా బాగా నచ్చింది. దానికి సీక్వెల్ గా రూపొందుతోన్న `మా ఊరి పొలిమేర-2` టీజర్ కూడా చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది. మొదటి పార్ట్ లా సెకండ్ పార్ట్ కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ టీమ్ అందరికీ నా శుభాకాంక్షలు`` అన్నారు.
నిర్మాత గౌరికృష్ణ మాట్లాడుతూ..గతంలో అదాశర్మతో నేను `క్వశ్చన్ మార్క్` అనే సినిమా తీశాను. పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. ఈ క్రమంలో ఓ రోజు ఓటీటీలో `మా ఊరి పొలిమేర` సినిమా చూశాను. నాకు చాలా బాగా నచ్చింది. వెంటనే డైరక్టర్ అనిల్ కి కాల్ చేసి సీక్వెల్ నా బేనర్ లో చేస్తాను అన్నాను. తను కూడా ఓకె చెప్పాడు. ఫస్ట్ పార్ట్ కన్నా రెండో పార్ట్ అంతకు మించి చేశాడు. స్క్రీన్ ప్లే, డైరక్షన్ నాకు చాలా బాగా నచ్చింది. సత్యం రాజేష్, కామాక్షి పోటాపోటీగా నటించారు. ఒక మంచి సినిమా ప్రేక్షకులకు అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మొదటి పార్ట్ పెద్ద హిట్టయింది. అలాగే డైరక్టర్ మీద నమ్మకంతో బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా భారీ బడ్జెట్ తో సినిమా చేశాం. ఈ నెలాఖరులో కానీ ఆగస్ట్ మొదటి వారంలో కానీ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం`` అన్నారు.
దర్శకుడు డా.అనిల్ విశ్వనాథ్ మాట్లాడుతూ...``లాక్ డౌన్ సమయంలో టీవీలో ప్రసారమైన ఒక రియల్ ఇన్స్ డెంట్ చూసి ఇన్ స్పైర్ అయి ఈ కథ రాసుకున్నా. మా ఊరి పొలిమేర తీసే సమయంలోనే సెకండ్ పార్ట్ కథ కూడా రాశాను. గ్రామీణ నేపథ్యంలో జరిగే కథ కాబట్టి.. క్యారక్టర్స్ తగ్గట్టుగా బోల్డ్ డైలాగ్స్, సీన్స్ ఉంటాయి తప్ప..ఎక్కడా కావాలని ఏదీ పెట్టలేదు. నిజంగా బ్లాక్ మ్యాజిక్ ఉందా? లేదా? అనే డెబిట్ మీద వెళ్లలేదు. ఒక వేళ ఉంటే ఎలా ఉంటుంది అనేది చూపించే ప్రయత్నం చేశాము. పాడేరు, కేరళ, ఉత్తరాఖండ్ లో షూటింగ్ చేశాము. సెకండ్ పార్ట్ లో పద్మనాభ స్వామి టెంపుల్ అంశాన్ని కూడా లైట్ గా టచ్ చేసే ప్రయత్నం చేశాము. అది ఏంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇది మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సాగే చిత్రం. అందులో బ్లాక్ మ్యాజిక్ అనే అంశాన్ని జోడించాము. మా నిర్మాత ఎక్కడా రాజీ పడకుండా నేను అడిగిన ప్రతిదీ సమకూర్చారు. సత్యం రాజేష్, కామాక్షి అద్భుతంగా నటించారు. ఎవరూ ఊహించని విధంగా సెకండ్ పార్ట్ ఉండబోతుంది. మా సినిమా టీజర్ వరుణ్ తేజ్ గారు లాంచ్ చేసి మా సినిమాకు మరితం బజ్ తెచ్చారు`` అన్నారు.
నటి కామాక్షి మాట్లాడుతూ...``ప్రియురాలు` నా మొదటి సినిమా. ఆ తర్వాత `మా ఊరి పొలిమేర` చిత్రం చేశాను. ఈ సినిమాలో నా పాత్రకు మంచి పేరొచ్చింది. పార్ట్ 2 లో కూడా నా క్యారక్టర్ ని చాలా బాగా డిజైన్ చేశారు దర్శకుడు. నేను డాక్టర్ ని, థియేటర్ ఆర్ట్ స్ట్ ని... కాబట్టి క్యారక్టర్ ని క్యారక్టర్ లాగే చూస్తాను తప్ప..వేరే ఏమీ ఆలోచించను. అందుకే నాకు వచ్చిన పాత్రలు...నచ్చిన పాత్రలు చేసుకుంటూ ముందుకు వెళుతున్నా. ఈ సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గర అవుతానన్న నమ్మకం ఉంది`` అన్నారు.
నటుడు సత్యం రాజేష్ మాట్లాడుతూ, ఇందులో ఒక ఇంపార్టెన్స్ ఉన్న పవర్‌పుల్ రోల్ చేశాను. మొదటి భాగం చేశాక చాలా మంది సెకండ్ పార్ట్ ఎప్పుడూ అంటూ ఎంతో క్యూరియాసిటీ చూపించారు. మొదటి పార్ట్ పెద్ద హిట్టయింది. చాలా సంతోషం. ఈ సినిమా కోసం పది కేజీలు పెరిగాను. స్మశానంలో కొన్ని సీన్స్ చేయాల్సి వచ్చినప్పుడు కొంత భయపడ్డాను. నా నటన ఇందులో చాలా నేచరల్ గా ఉంటుంది. నటుడుగా నన్ను మరో మెట్టు ఎక్కించే చిత్రమవుతుందన్న నమ్మకం ఉంది. ఇందులో కామాక్షి నట విశ్వరూపం చూస్తారు`` అన్నారు.