నిఖిల్,అనుపమ పరమేశ్వరన్ 18 పేజిస్ చిత్రం నుండి లిరికల్ వీడియో విడుదల

Webdunia
శుక్రవారం, 18 నవంబరు 2022 (10:46 IST)
18 pages
వరుస హిట్ సినిమాలను నిర్మిస్తున్న "జీఏ 2" పిక్చర్స్ లో రాబోతున్న తదుపరి చిత్రం "18 పేజిస్" నిఖిల్ సిద్దార్థ , అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న ఈ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తున్నారు.మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు.  ఇదివరకే రిలీజైన ఈ చిత్ర టీజర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసింది. 
 
ఇటీవలే కార్తికేయ-2 సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్నారు  నిఖిల్ సిద్ధార్థ & అనుపమ పరమేశ్వరన్. మాములు చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం రోజురోజుకు థియేటర్స్ ను, కలక్షన్స్ ను పెంచుకుంటూ తిరుగులేని విజయాన్ని సాధించింది. కృష్ణ తత్వాన్ని, కృష్ణ సారాంశాన్ని చెప్పిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన కలక్షన్స్ సాధించింది. అంతటి ఘనవిజయం సాధించిన కార్తికేయ- 2 తరువాత అనుపమ పరమేశ్వరన్, నిఖిల్ జంటగా చేస్తున్న చిత్రం కావడంతో ఈ "18 పేజిస్" సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.  ఈ చిత్రంను డిసెంబర్ 23 న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నాస్టాల్జిక్ రొమాన్స్‌ని పుష్ప దర్శకుడు సుకుమార్ రాశారు. ఇదివరకే గతంలో  కుమారి 21 ఎఫ్ చిత్రంతో హిట్ అందుకున్న పల్నాటి సూర్య ప్రతాప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
 
"18 పేజిస్" చిత్రం నుండి విడుదలకాబోయే  సాంగ్ అప్డేట్ ను అధికారికంగా ప్రటించారు మేకర్స్. ఈ చిత్రం నుండి "నన్నయ్య రాసిన" అనే లిరికల్ వీడియో సాంగ్ ను నవంబర్ 22న విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ  చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.నవీన్ నూలి ఈ చిత్రానికి ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 23న క్రిస్టమస్ కానుకగా విడుదల చేయనున్నారు. 
 
తారాగణం: నిఖిల్ సిద్దార్థ & అనుపమ పరమేశ్వరన్
స్క్రీన్ ప్లే & దర్శకత్వం: పల్నాటి సూర్య ప్రతాప్ 
కథ: సుకుమార్
ప్రొడక్షన్: GA2 పిక్చర్స్ & సుకుమార్ రైటింగ్స్
నిర్మాత: బన్నీ వాస్
సంగీతం: గోపీ సుందర్
సినిమాటోగ్రఫీ: వసంత్
ఎడిటర్: నవీన్ నూలి
ఆర్ట్ డైరెక్టర్: రమణ వంక
ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: శరణ్ రాపర్తి (గీతా ఆర్ట్స్), అశోక్ బండ్రెడ్డి
రచయిత: శ్రీకాంత్ విస్సా
లైన్ ప్రొడ్యూసర్: బాబు 
పిఆర్‌ఓ: ఏలూరు శ్రీను, మడూరి మధు, మేఘ శ్యామ్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సిడ్నీలో రోడ్డు ప్రమాదం.. రోడ్డు దాటిన 8నెలల గర్భవతి.. భారతీయ మహిళ మృతి

శబరిమలలో భారీ రద్దీ.. స్పృహ కోల్పోయి మృతి చెందిన మహిళా భక్తురాలు

నవంబర్ 22 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు

మీరు కూడా దేవుళ్లే అంటూ చెప్పిన సత్యసాయి జయంతి ఉత్సవాలకు ప్రధానమంత్రి మోడి

పదేళ్ల క్రితం నిర్వహించిన గ్రూపు-2 పరీక్ష రద్దు : తెలంగాణ హైకోర్టు ఆదేశాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments