Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశాన్ని ప్రేమించ‌డం అంద‌రి ప‌నే. వారిని కాపాడేది సోల్జ‌ర్ ప‌ని

Webdunia
సోమవారం, 12 ఏప్రియల్ 2021 (17:13 IST)
Major advisesh
ముంబైలో 26/11 దాడి గురించి వ‌ర్మ గ‌తంలో సినిమా తీశాడు. ఇప్పుడు ఆ దాడిలో పాల్గొన్న మేజ‌ర్ క‌థ‌ను ఆధారంగా చేసుకుని `మేజ‌ర్‌` సినిమా రాబోతోంది. ఎవ‌రు, గూఢ‌చారి చిత్రాల హీరో అడవి శేష్ టైటిల్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా టీజ‌ర్ ఈరోజు విడుద‌ల చేశారు. హైద‌రాబాద్‌లోని ఎ.ఎం.బి.మాల్‌లో దీనిని విడుద‌ల చేశారు. పాన్ ఇండియన్ సినిమాను సిద్ధం చేస్తున్నాడు శేష్. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ విడుదలైంది. తెలుగు వెర్షన్‌కు సంబంధించిన టీజర్‌ను మహేష్ బాబు.. హిందీ వెర్షన్‌ సల్మాన్ ఖాన్.. మలయాళం వెర్షన్‌ పృథ్వీరాజ్ సుకుమరన్ విడుదల చేసారు. పాన్ ఇండియన్ సబ్జెక్ట్ కావడంతో అన్ని భాషల్లోనూ ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.
 
ఈ సినిమాను సూపర్‌స్టార్ మహేష్ బాబు నిర్మిస్తుండటం విశేషం. ఈ మేజర్ సినిమా కథ విషయానికి వస్తే.. 26/11 ముంబై తీవ్రవాద దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా రూపొందుతుంది. మేజర్ సినిమాను `గూఢచారి` ఫేమ్ శశి కిరణ్ తిక్కా తెరకెక్కిస్తున్నాడు. శోభితా ధూళిపాళ్ల, బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 
 
తాజాగా విడుదలైన టీజర్‌లో, సోల్జ‌ర్ అవ్వాల‌నుకుంటున్నావా? ఎందుకు? అంటూ ప్ర‌కాష్‌రాజ్ అడుగుతాడు. వారిని ఏమంటారు. పేట్రియాట్స్ ‌డాట్ అని శేష్ బ‌దులిస్తాడు. - మ‌న బోర్డ‌ర్‌లో ఎలా ఫైట్ చేయాలి, ఇండియా క్రికెట్ మేచ్ ఎలా గెల‌వాలి? అని అంద‌రూ ఆలోచిస్తారు. అదీ దేశ‌క్తే. దేశాన్ని ప్రేమించడం అంద‌రి ప‌నే. వారిని కాపాడ‌డం సోల్జ‌ర్ ప‌ని.అంటూ శేష్ ప‌లికే డైలాగ్‌తోపాటు యాక్ష‌న్ స‌న్నివేశాలు చూపించారు. ఈ సినిమా జులై 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నేను కోరుకున్న చదువు పుస్తకాల్లో లేదు.. అందుకే ఇంటర్‌తో ఆపేశా : పవన్ కళ్యాణ్

15 అడుగుల స్టేజీపై నుంచి కిందపడిన కేరళ ఎమ్మెల్యే ఉమా థామస్ (వీడియో)

Liquor Sales: కొత్త సంవత్సరం.. రెండు రోజుల్లోనే ఎక్సైజ్ శాఖకు రూ.684కోట్ల ఆదాయం

covid 19 చైనాపై మరోసారి పంజా, 170 మంది మృతి, ప్రపంచం బెంబేలు

తెలుపు కాదు.. నలుపు కాదు.. బ్రౌన్ షర్టులో నారా లోకేష్.. పవన్‌ను అలా కలిశారు.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కోడి గుడ్లు, పాలు ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

అతి నిద్రతో అనారోగ్య సమస్యలు, ఏంటవి?

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

తర్వాతి కథనం
Show comments