Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ వద్దు.. టాలీవుడ్డే ముద్దంటున్న హీరోయిన్!

Love Story
Webdunia
బుధవారం, 12 మే 2021 (19:37 IST)
సాయిపల్లవి... టాలీవుడ్ హీరోయిన్. ఈమె తమిళనాడుకు చెందిన అమ్మాయి అయినప్పటికీ.. అచ్చతెనుగు అమ్మాయిలా ఉంటుంది. పైగా, తెలుగు చిత్రాలకు అతికినట్టుగా సరిపోయారు. ఈ క్రమంలో టాలీవుడ్‌తో పాటు... కోలీవుడ్‌లో వరుస ప్రాజెక్టులు చేస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో ఇటీవల తనకు వచ్చిన ఓ బాలీవుడ్ ప్రాజెక్టును ఆమె సున్నితంగా తిరస్కరించినట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా "ఛత్రపతి" హిందీ రీమేక్ తెరకెక్కబోతుంది. వి.వి.వినాయక్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో హీరోయిన్లుగా పలువురు బాలీవుడ్ హీరోయిన్స్‌ను సంప్రదించినట్టు వార్తలు వచ్చాయి. 
 
కానీ ఇప్పటివరకు ఎవరూ ఫైనల్ కాలేదని సమాచారం. ఈ క్రమంలో ఇటీవల "ఫిదా" బ్యూటీ సాయి పల్లవిని సంప్రదించారట. అయితే ప్రస్తుతం ఈమె టాలీవుడ్‌లో వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీగా ఉండటంతో డేట్స్ సర్దుబాటు చేయలేనని చెప్పినట్టు తెలుస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్ - వినాయక్‌లకు హిందీలో డెబ్యూ సినిమా కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. ఇక హీరోయిన్‌గా ఎవరికి ఛాన్స్ దక్కుతుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రైలులో మైనర్ బాలికకు లైంగిక వేధింపులు.. వీడియో తీసిన దుండగుడు..

ప్లీజ్.. చైనా అమ్మాయిలతో శారీరక సంబంధం వద్దు : అమెరికా

ఏపీ సచివాలయంలో అగ్నిప్రమాదం.. ఆ బ్లాక్‌లోనే డిప్యూటీ సీఎం పేషీ!! (Video)

వలస విధానం మరింత కఠినతరం : హెచ్1బీ వీసాదారులకు హెచ్చరిక

తెలంగాణాలో రాగల రెండు రోజుల వడగండ్ల వానలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments