Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాలీవుడ్ సినిమాకు నో చెప్పిన ఫిదా భామ?

Advertiesment
Sai Pallavi
శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన 'ఫిదా' సినిమాతో తెలుగు తెరపైకి ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి తెలుగులో వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఇటు తెలుగు, తమిళం, మళయాళంలో కూడా వరుస సినిమాల్లో నటిస్తూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ లో వచ్చిన ఆఫర్ ను సాయి పల్లవి సున్నితంగా తిరస్కరించిందని టాలీవుడ్ టాక్.
 
బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఛత్రపతి హిందీ రీమేక్ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. వి వి వినాయక్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా పలువురు బాలీవుడ్ హీరోయిన్స్‌ను సంప్రదించినట్టు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు ఎవరూ ఫైనల్ కాలేదని సమాచారం. 
 
ఈ క్రమంలో ఇటీవల ఫిదా బ్యూటీ సాయి పల్లవి ని సంప్రదించారట. అయితే ప్రస్తుతం ఈమె టాలీవుడ్‌లో వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీగా ఉండటంతో డేట్స్ సర్దుబాటు చేయలేనని చెప్పినట్టు తెలుస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్ - వినాయక్‌లకు హిందీలో డెబ్యూ సినిమా కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ సినిమాలో నటించేందుకు సాయిపల్లకి రెండు కోట్ల రెమ్యునరేషన్ ఇస్తామని చెప్పినా ఆమె అంగీకరించలేదని టాక్ వస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిరంజీవికి షాకిచ్చిన తెలుగువాడైన తమిళ దర్శకుడు??