Webdunia - Bharat's app for daily news and videos

Install App

లవ్ స్టోరీ అస‌లేం జ‌రిగింది? థియేట‌ర్లా?? లేక ఓటీటీయా??

Webdunia
మంగళవారం, 14 జులై 2020 (22:56 IST)
తెలంగాణ‌లో జ‌రిగిన య‌దార్థ సంఘ‌ట‌ల ఆధారంగా రూపొందించిన స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ల‌వ్ స్టోరీ అస‌లేం జరిగింది పాట‌ల‌కు ఆడియ‌న్స్ నుంచి చ‌క్క‌టి స్పంద‌న వ‌స్తుంద‌ని చిత్ర నిర్మాత కింగ్ జాన్స‌న్ తెలిపారు. విజ‌య్ ఏసుదాస్‌, విజ‌య్ ప్ర‌కాష్‌, యాజిన్ నిజార్‌, మాళ‌విక‌, రాంకీ, భార్గ‌వి పిళ్లై వంటి ప్ర‌ముఖ సింగ‌ర్లు పాడిన పాట‌ల‌కు అమెజాన్ మ్యూజిక్‌, స్పాటిఫై, జియోసావ‌న్‌, యాపిల్ మ్యూజిక్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫార‌మ్స్ నుంచి చ‌క్క‌టి రెస్సాన్స్ వ‌స్తున్నందుకు సంతోషంగా ఉంద‌న్నారు.
 
ఇప్ప‌టికే ఈ సినిమాకు సెన్సార్ క్లియ‌రెన్స్ వ‌చ్చింద‌ని, థియేట‌ర్లు తెరుచుకునేంత ‌వ‌ర‌కూ వేచి చూడాలా? లేక ఓటీటో ప్లాట్‌ఫార‌మ్స్‌లో రిలీజ్ చేయాలా? అనే విష‌యాన్ని అంత‌ర్గతంగా చ‌ర్చిస్తున్నామ‌ని వివ‌రించారు. 
 
ఎందుకంటే సినిమా అనుకున్న‌దానికంటే రిచ్‌గా వ‌చ్చింద‌ని, 8కే రిజ‌ల్యూష‌న్ కెమెరాతో రూపొందించిన ఈ సినిమాకు ప్ర‌ముఖ బ్యాక్‌గ్రౌండ్ స్కోర‌ర్ ఎస్‌. చిన్నా ప్రాణం పోశార‌ని, సేతు స్పెష‌ల్ ఎఫెక్ట్స్ వంటివి ప్రేక్ష‌కుల్ని చివ‌రి వ‌ర‌కూ ఉత్కంఠ‌ను క‌లిగిస్తాయ‌ని తెలిపారు.
 
మంచి ప‌ర్‌ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న క‌థకు హీరో శ్రీరాం ప్రాణం పోశాడ‌ని, అత‌ని న‌ట‌నాప్ర‌తిభను చూసి ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్ వ‌స్తుంద‌నే న‌మ్మ‌క‌ముంద‌ని తెలిపారు. మ్యూజిక్ డైరెక్ట‌ర్ యేలేంద్ర మ‌హావీర్ స్వ‌ర‌క‌ల్ప‌న‌లో రూపొందించిన అస‌లేం జ‌రిగింది సినిమా పాట‌ల‌ను ఆదిత్యా మ్యూజిక్ ఇటీవ‌ల విడుద‌ల చేసింది. ఐదు విభిన్న‌మైన గీతాల‌కు ఆడియ‌న్స్ నుంచి చ‌క్క‌టి ఆద‌ర‌ణ ల‌భిస్తుంద‌ని చిత్ర నిర్మాత నీలిమా చౌద‌రి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Roja: భయం అనేది మా నాయకుడు జగన్ రక్తంలో లేదు.. ఆర్కే రోజా (video)

Chandrababu: అంబేద్కర్‌ను గుర్తించడంలో కీలక పాత్ర ఎవరిది..? చర్చ జరగాల్సిందే.. చంద్రబాబు

పట్టపగలే చైన్ స్నాచింగ్.. కాలింగ్ బెల్ కొట్టి మహిళ మెడలోని..? (video)

Pune: బస్సులో వేధిస్తావా? పీటీ టీచర్ మజాకా.. 25సార్లు చెంప ఛెల్లుమనిపించింది.. (video)

ఫార్ములా ఈ రేస్‌ వ్యవహారంలో కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments