Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఏ1 ఎక్స్‌ప్రెస్‌`లో సిక్స్ ప్యాక్ సందీప్‌కిష‌న్‌కు ల‌వ్ వ్య‌క్తం చేసిన లావ‌ణ్య‌

Webdunia
బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (14:27 IST)
A1 Express, Lavanya, sandeep
ఇదివ‌ర‌కు విడుద‌ల చేసిన ఏ1 ఎక్స్‌ప్రెస్'. ట్రైల‌ర్‌కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ ల‌భించింది. భారతదేశం తరఫున ఆడాలని కలలు కనే యువ‌ హాకీ ఆటగాడిగా ఈ మూవీలో సందీప్ కిషన్ న‌టిస్తున్నారు. ఆయ‌న‌ ప్రేమికురాలి పాత్ర‌లో లావణ్య త్రిపాఠి కూడా హాకీ ప్లేయ‌ర్ రోల్ చేస్తుండ‌టం విశేషం. ఆన్ స్క్రీన్ మీద ఈ జంట చూడ‌ముచ్చ‌ట‌గా ఉంది. ట్రైలర్‌లో త‌న హాకీ స్కిల్స్‌తో సందీప్ కిష‌న్ అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌చ‌కితుల్ని చేశారు. ఈ సినిమా కోసం బ‌రువు త‌గ్గి సిక్స్ ప్యాక్ బాడీని సాధించారు.
 
సందీప్ కిష‌న్ న‌టిస్తోన్న 25వ చిత్రం 'ఏ1 ఎక్స్‌ప్రెస్'. టాలీవుడ్‌లో రూపొందుతోన్న తొలి హాకీ ఫిల్మ్‌గా గుర్తింపు పొందిన ఈ న్యూ-ఏజ్ స్పోర్ట్స్ ఎంట‌ర్‌టైన‌ర్ హీరో సందీప్ కిష‌న్‌కి అత్యంత ప్రతిష్ఠాత్మ‌క‌ ప్రాజెక్ట్. డెన్నిస్ జీవ‌న్ క‌నుకొల‌ను ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్న ఈ మూవీలో లావ‌ణ్య త్రిపాఠి హీరోయిన్‌గా న‌టిస్తోంది.  పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ‌, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌, వెంక‌టాద్రి టాకీస్ ప‌తాకాల‌పై టి.జి. విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషెక్ అగ‌ర్వాల్‌, సందీప్ కిష‌న్‌, ద‌యా ప‌న్నెం నిర్మిస్తున్నారు. ఫిబ్ర‌వ‌రి 26న ఈ చిత్రం విడుద‌ల‌వుతోంది.
 
బుధ‌వారం ఈ చిత్రంలోని "అమిగో" అంటూ సాగే సాంగ్ లిరిక‌ల్ వీడియోను చిత్ర బృందం విడుద‌ల చేసింది. హిప్‌హాప్ త‌మిళ మ్యూజిక్ అందించిన ఈ పెప్పీ సాంగ్‌ను రామ‌జోగ‌య్య శాస్త్రి ర‌చించ‌గా, ఇన్నో గెంగా ఆల‌పించారు. మూవీలో ఈ సాంగ్‌ను సందీప్ కిష‌న్‌, లావ‌ణ్యా త్రిపాఠి, డాన్స‌ర్స్‌పై చిత్రీక‌రించారు. హుషారైన బీట్‌తో ఆక‌ట్టుకుంటున్న ఈ సాంగ్‌లో హీరోయిన్‌పై త‌న ప్రేమ‌ను వ్య‌క్తం చేస్తున్నాడు హీరో. యూత్‌లో ఈ సాంగ్ మంచి క్రేజ్ తెచ్చుకుంటుంద‌న‌డంలో సందేహం లేదు.
 
ఇంకా రావు ర‌మేష్‌, మురళీ శ‌ర్మ‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, ప్రియ‌ద‌ర్శి, స‌త్యా, రాహుల్ రామ‌కృష్ణ‌, మ‌హేష్ విట్టా, ర‌ఘుబాబు, అభిజిత్‌, భూపాల్‌, ఖ‌య్యుమ్‌, సుద‌ర్శ‌న్‌, శ్రీ‌రంజ‌ని, ద‌యా గురుస్వామి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విష వాయువు పీల్చి... జార్జియాలో 12 మంది మృతి

రాజ్యాంగ మౌలిక స్వరూపానికి వన్ నేషన్ - వన్ ఎలక్షన్ బిల్లు విరుద్ధం : కాంగ్రెస్

జమిలి ఎన్నికల బిల్లుపై లోక్‌సభలో ఓటింగ్

జనవరి 1, 2025 నుండి ఇండోర్ యాచిస్తే ఎఫ్ఐఆర్ నమోదు..

డిసెంబరు 17 నుండి 21 వరకు తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రపతి పర్యటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments