Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మార్చి 19న కార్తికేయ, లావణ్య త్రిపారి చిత్రం ‘చావు కబురు చ్లగా’

Advertiesment
Kartikeya
, ఆదివారం, 31 జనవరి 2021 (18:36 IST)
Kartikeya, Lavanya Tirpati
కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న చిత్రం ‘చావు కబురు చ్లగా’. అు్ల అరవింద్‌ సమర్పణలో బన్నీవాసు నిర్మాతగా తెరకెక్కిస్తున్న చిత్రమిది. కౌశిక్‌ పెగళ్లపాటి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇప్పటికే విడుదలైన టైటిల్‌. హీరో కార్తికేయ ‘బస్తి బారాజు’ ఫ‌స్ట్‌లుక్‌‌, ఇంట్రోకు మంచి స్పందన వచ్చింది, ఆ తరువాత విడుదలైన క్యారెక్టర్‌ వీడియో, లావణ్య త్రిపాఠి ఫ‌స్ట్‌లుక్‌కి, టీజర్‌ గ్లిమ్ప్స్‌కి కూడా అనూహ్య స్పందన భించింది. ముఖ్యంగా కార్తికేయ గెటప్‌, డైలాగ్‌ డెలివరి మాడ్యూలేషన్‌ చూస్తే మళ్లీ చూడానిపించేలా ఉందంటూ కామెంట్స్‌ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మార్చి 19న ఈ చిత్రాన్ని ప్రేక్షకు ముందుకు తీసుకువస్తున్నట్లుగా నిర్మాత బన్నీవాసు అధికారికంగా ప్రకటించారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దర్శకుడు కౌశిక్‌ పెగళ్లపాటి అన్ని వర్గా ప్రేక్షకుల్ని ఆకట్టుకునే రీతిన ఈ చిత్రాన్ని సిద్ధం చేస్తున్నారనే విషయం ఇటీవలే విడుదలైన బస్తీబారాజు క్యారెక్టర్‌ వీడియో ద్వారా. అలానే తాజాగా వచ్చిన టీజర్‌ గ్లింప్స్‌ ద్వారా స్పష్టం అవుతుంది. జిఏ2 పిక్చర్స్‌ బ్యానర్‌లో ‘100% వ్‌’, ‘భలేభలే మగాడివోయ్‌’, ‘గీతగోవిందం’, ‘ప్రతిరోజు పండగే’ చిత్రాు ఘన విజ‌యాలు సాధించాయి. ఆ లెగసినీ సక్సెస్‌ఫుల్‌గా ముందుకుతీసుకువెళుతుందనే నమ్మకంతో ఉన్నామని అన్నారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా మార్చి 19న భారీ స్థాయిలో విడుద చేయడానికి సన్నాహాు చేస్తున్నట్లుగా బన్నీ వాసు తెలిపారు. దీనికి సంబంధించిన మరిన్ని వివ‌రాలు త్వరలోనే అధికారికంగా విడుద అవ్వనున్నాయి. ఇంకా ఈ సినిమాలో ఆమని, మురళి శర్మ, రజిత, భద్రం, మహేష్‌, ప్రభు తదితయి నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటర్‌- సత్య జి, ఆర్ట్‌: జి ఎమ్‌ శేఖర్‌, మ్యూజిక్‌: జేక్స్‌ బిజాయ్‌, సినిమాటోగ్రాఫర్‌: కరమ్‌ ఛావ్లా, అడిషినల్‌ డైలాగ్స్‌: శివ కుమార్‌ భూజు, ఎగ్జిక్యూటివ్‌ ప్రోడ్యూసర్స్‌: రాఘవ కరుటూరి, శరత్‌ చంద్ర నాయిడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సిద్ధు జొన్నగడ్డ, నేహాశెట్టి జంటగా ‘నరుడి బ్రతుకు నటన’ చిత్రం