Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లావణ్య త్రిపాఠి పుట్టినరోజు.. 'చావు కబురు చల్లగా' పోస్టర్ రిలీజ్

Advertiesment
లావణ్య త్రిపాఠి పుట్టినరోజు.. 'చావు కబురు చల్లగా' పోస్టర్ రిలీజ్
, మంగళవారం, 15 డిశెంబరు 2020 (16:23 IST)
మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్పణ‌లో వ‌రస విజయాలు అందుకుంటూ సక్సెస్‌కు మారుపేరుగా నిలిచిన ‌బన్నీ వాసు నిర్మాత‌గా ఎన‌ర్జిటిక్ యంగ్ హీరో కార్తీకేయ‌, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా నూత‌న ద‌ర్శకుడు కౌశిక్ పెగ‌ళ్లపాటి తెర‌కెక్కిస్తున్న చిత్రం 'చావు క‌బురు చ‌ల్లగా'. 
 
ఈ సినిమాలో డింపుల్‌ బ్యూటి లావ‌ణ్య త్రిపాఠి మ‌ల్లిక అనే హైద‌రాబాదీ బ‌స్తీ అమ్మాయిగా క‌నిపించ‌నుంది. మ‌ల్లిక‌గా లావ‌ణ్య త్రిపాఠి లుక్ ఇప్ప‌టికే విడుద‌లై అనూహ్య స్పంద‌న అందుకున్న విష‌యం తెలిసిందే. 
 
ఈ నేప‌థ్యంలో లావ‌ణ్య త్రిపాఠి మంగళవారం పుట్టిన రోజును జరుపుకున్నారు. ఈ సంద‌ర్భంగా కొత్త లుక్‍ని విడుద‌ల చేశారు. సొట్ట బుగ్గ‌ల‌తో న‌వ్వూతూ క‌నిపిస్తున్న లావ‌ణ్య త్రిపాఠి స్టిల్‌తో చూసిన వెంట‌నే ఆక‌ట్టుకునే రీతిన చావుక‌బ‌రుచ‌ల్ల‌గా టీమ్ ఈ కొత్త లుక్‌ని సిద్ధం చేశారు. 
 
ఇక ఈ చిత్రంలో హీరోగా న‌టిస్తున్న యంగ్ హీరో కార్తికేయ బ‌స్తి బాలారాజు గెటెప్, క్యారెక్ట‌రైజేష‌న్ చాలా కొత్త‌గా ఆకట్టుకునే విధంగా ఉంటాయ‌ని, అలానే లావ‌ణ్య పాత్ర కూడా న్యాచురల్‌గా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమాకు జకీస్ బీజాయ్ సంగీతం అందిస్తున్నారు.
 
ఈ చిత్రం గురించి నిర్మాత బ‌న్నీ వాసు మాట్లాడుతూ జిఏ2 పిక్చర్స్ బ్యాన‌ర్‌లో 'భ‌లేభ‌లే మ‌గాడివోయ్'‌, 'గీతాగోవిందం', 'ప్రతిరోజు పండ‌గే' వంటి చిత్రాలు నిర్మించగా, అవి ఘ‌న‌ విజాయాలు సాధించాయి. అలాంటి బ్యాన‌రులో వ‌చ్చే ప్రతీ చిత్రంపై ప్రేక్షకుల‌కి అంచ‌నాలు వుంటాయి. 
 
వారిని దృష్థిలో పెట్టుకుని చిత్రాలు నిర్మిస్తున్నాం. కార్తికేయ గ‌త చిత్రాలకి ఈ చిత్రం పూర్తి భిన్నంగా వుండాలి అనుకున్నాం. అందుకే బస్తీబాల‌రాజుగా టీజ‌ర్‌లో చూపించాం. లావ‌ణ్య త్రిపాఠి‌ని మ‌ల్లిక‌గా ప‌రిచ‌యం చేసాం. త‌న పాత్ర ప్రతి ఒక్కరికీ గుర్తుండిపోతుంది. అన్ని వార్గాల్ని ఆక‌ట్టుకునే రీతిన ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు కౌశిక్ తెర‌కెక్కిస్తున్నాడు అని అన్నారు. 
 
తారాగ‌ణం..
కార్తీకేయ‌, లావ‌ణ్య త్రిపాఠి, ఆమ‌ని,ముర‌ళి శ‌ర్మ‌, ర‌జిత‌, భ‌ద్రం, మ‌హేష్‌, ప్ర‌భు త‌దితరులు
 
సాంకేతిక వ‌ర్గం..
స‌మ‌ర్ప‌ణ - అల్లు అర‌వింద్
బ్యాన‌ర్ - జీఏ2 పిక్చ‌ర్స్
నిర్మాత - బ‌న్నీ వాసు
ఎడిట‌ర్‌ - స‌త్య జి
ఆర్ట్‌ - జి ఎమ్ శేఖ‌ర్‌
సినిమాటోగ్రాఫ‌ర్ - క‌ర‌మ్ ఛావ్లా
అడిషిన‌ల్ డైలాగ్స్ - శివ కుమార్ భూజుల‌
ప్రోడ‌క్ష‌న్ డిజైన‌ర్ - మ‌నిషా ఏ ద‌త్‌
కాస్ట్యూమ్ డిజైన‌ర్‌ - మౌనా గుమ్మ‌డి
పి ఆర్ ఒ - ఏలూరు శ్రీను, మేఘ‌శ్యామ్
ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్స్‌ -  రాఘ‌వ క‌రుటూరి, శ‌ర‌త్ చంద్ర నాయిడు.
మ్యూజిక్ - జేక్స్‌ బిజాయ్
ద‌ర్శకుడు - కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'కౌన్‌ హే అచ్చా... కౌన్ హే లుచ్చా...' పాట‌కు స్పంద‌న‌ అపూర్వం