Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖుష్బూ ప్రాణాలను కాపాడిన "లార్డ్ మురుగన్" ... కారు ప్రమాదంలో జస్ట్ ఎస్కేప్...

Webdunia
బుధవారం, 18 నవంబరు 2020 (11:26 IST)
ఇటీవలే భారతీయ జనతా పార్టీలో చేరిన సినీ నటి ఖుష్బూకు బుధవారం తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారును ఓ కంటైనర్ లారీ డీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు వెనుక వైపు డోరు పూర్తిగా ధ్వంసమైంది. 
 
అయితే, సమయానికి ఎయిర్‌బెలూన్లు తెరుచుకోవడంతో కారులో ఉన్నవారంతా క్షేమంగా బయటపడ్డారు. మరికొంతమందితో కలిసి వేల్‌ యాత్రలో పాల్గొనేందుకు కుష్బూ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
 
ఈ ప్రమాదం చెన్నై నగర శివారు ప్రాంతంలోని మధురాంతకం అనే ప్రాంతంలో సంభవించింది. ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయపటిన ఖుష్బూతో పాటు.. కారులోని మిగిలినవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేశారు. 
 
ఈ ప్రమాదం తర్వాత ఖుష్బూ ఓ ట్వీట్ చేస్తూ, ఈ రోజు జరిగిన కారు ప్రమాదంలో తమను మురుగన్ (సుబ్రహ్మణ్య స్వామి) స్వామి ప్రాణాలతో కాపాడారని చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

వెలుగు చూడాల్సిన జగన్ జల్సా ప్యాలెస్ రహస్యాలు చాలా ఉన్నాయ్... : మంత్రి నారా లోకేశ్

సిగ్నల్ జంప్ చేసి ఎక్స్‌ప్రెస్ రైలను ఢీకొన్న గూడ్సు రైలు.. 15కి పెరిగిన మృతులు

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన... త్వరలో ప్రారంభం

19న డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్న పవన్

లోక్‌సభ ఎన్నికల్లో చిత్తుగా ఓడిన అన్నాడీఎంకే... రీఎంట్రీకి ఆసన్నమైందంటున్న శశికళ!

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments