Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవిశ్రీ ఇంటి నుండి బుల్లి రాక్‌స్టార్... వీడియో వైరల్

Webdunia
శుక్రవారం, 27 డిశెంబరు 2019 (13:31 IST)
ఎనర్జిటిక్ సంగీతంతో పాటుగా ఎప్పుడూ ఎనర్జిటిక్‌గై ఉండే యువ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్. ఈయన క్లాస్, మాస్ ప్రేక్షకులను తన సంగీతంతో మెస్మరైజ్ చేస్తుంటారు. తన కెరీర్‌లో ఇప్పటివరకు ఎన్నో హిట్‌లు, మైమరిచిపోయే మెలడీలు, స్టెప్పులు వేసే మాస్ బీట్‌లతో పాటుగా ఇప్పటికే తొమ్మిది ఫిలింఫేర్‌ అవార్డులను సొంతం చేసుకున్నారు.
 
తాజాగా ఆయన చేస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో రిలీజ్ చేసిన మూడు పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి, దీంతో ఇది మ్యూజికట్ హిట్ అవుతుందని అందరూ భావిస్తున్నారు. మరి దేవి ఖాతాలో మరో హిట్ పడేలా ఉంది. ఇటీవల సినిమా యూనిట్ ‘సరిలేరు నీకెవ్వరు ఆంథమ్‌’ రిలీజ్ చేసింది. దీనికి ప్రేక్షకుల నుండి విశేష ఆదరణ లభిస్తోంది.
 
ఈ ఆంథమ్‌ను దేవిశ్రీ ప్రసాద్‌ మేనల్లుడు తనవ్‌ సత్య కూడా నేర్చుకుని మరీ క్యూట్‌గా పాడాడు. ‘సరిలేరు నీకెవ్వరు’ ఆంథమ్‌ను హిట్‌ చేసిన ప్రేక్షకులకు థాంక్స్ చెప్తూ దేవిశ్రీ ఈ వీడియోను పోస్ట్‌ చేశారు. ఇందులో తనవ్‌ ‘సరిలేరు నీకెవ్వరు’ పాటను ఎంతో క్యూట్‌గా పాడటంతో పాటుగా పక్కనే ఉన్న టేబుల్‌పై కొడుతూ ఆ చిన్నారి మెప్పించాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు, సెలబ్రిటీలు తెగ కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణాలో పలు జిల్లాల్లో ఆరెంజ్ అలెర్ట్!!

అమ్మాయిలపై అత్యాచారం, బ్లాక్ మెయిల్: ఆ 9 మంది బ్రతికున్నంతవరకూ జైలు శిక్ష

సిందూరం తుడిచిన వారి నట్టింటికి వెళ్లి నాశనం చేశాం : ప్రధాని మోడీ

ఉగ్రవాదంపై ఉక్కుపాదం... షోపియాన్ జిల్లాలో ముగ్గురు ముష్కరుల హతం

భారత్ మాతాకీ జై నినాదాలతో మార్మోగిన ఆదంపూర్ వైమానిక స్థావరం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments