Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా పెర్‌ఫార్మెన్స్ చూడండంటున్న హిమ‌జ‌

Webdunia
మంగళవారం, 20 జులై 2021 (17:42 IST)
Himaja
బిగ్‌ బాస్ ఫేమ్ హిమ‌జ, ప్రతాప్ రాజ్ ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న సినిమా జ‌`. హిమ‌జ మాట్లాడుతూ, ‘‘ఫుల్ లెంగ్త్ ఫెర్‌ఫామెన్స్‌కి స్కోప్ ఉన్న పాత్ర కావ‌డంతో ఈ సినిమాను అంగీకరించాను. న‌టిగా న‌న్ను మ‌రో మెట్టు ఎక్కించే మూవీ ఇది. ఈ అవ‌కాశం ఇచ్చిన నిర్మాత‌ గోవ‌ర్ధన్ రెడ్డి గారికి, ద‌ర్శకుడు సైదిరెడ్డి గారికి కృత‌జ్ఞత‌లు" అన్నారు. ఈ హారర్‌ థ్రిల్లర్‌ ‘జ’ ట్రైల‌ర్‌ను హీరో సుధీర్‌బాబు మంగ‌ళ‌వారంనాడు విడుద‌ల చేశారు.
 
 జై దుర్గా ఆర్ట్స్ ప‌తాకంపై ప్రొడ‌క్షన్ నెం.1గా గోవ‌ర్థన్ రెడ్డి కందుకూరి నిర్మిస్తోన్న డిఫ‌రెంట్ హారర్‌ థ్రిల్లర్‌ ‘జ’. ఈ చిత్రం ద్వారా సైదిరెడ్డి చిట్టెపు ద‌ర్శకుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్స్ టీజ‌ర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి. కాగా ఈరోజు జ మూవీ ట్రైల‌ర్‌ను సుధీర్‌బాబు విడుద‌ల‌చేసి యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. డైలాగ్స్ లేకుండా కేవ‌లం బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తోనే సాగే ఈ ట్రైల‌ర్ సినిమాపై ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను మ‌రింత పెంచింది.
 
ద‌ర్శకుడు సైదిరెడ్డి చిట్టెపు మాట్లాడుతూ, `జ’ అంటే జ‌న్మ లేదా పుట్టుక అని అర్థం. ఈ టైటిల్ ఎందుకు పెట్టాం? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. మంచి క‌థా బ‌లం ఉన్న మూవీ. మా ప్రొడ్యూస‌ర్ గోవ‌ర్ధన్ రెడ్డి నా మీద న‌మ్మకంతో ధైర్యంగా ముందుకు వ‌చ్చి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించారు. అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ ఉపేంద‌ర్‌ స‌హ‌కారం మ‌రువ‌లేనిది’’ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Talakona: తలకోన సిద్ధేశ్వర స్వామి ఆలయంలో మెరుగైన సౌకర్యాలు

KPHB : వేశ్యతో గొడవ.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై కత్తితో దాడి

Bus crash: ఆప్ఘనిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. బస్సు- ట్రక్కు ఢీ.. 71మంది సజీవ దహనం

అన్నయ్యతో చెల్లెలు సంసారం.. ప్రెగ్నెంట్ కావడంతో భర్తకు డౌట్.. ఎందుకోసమంటే?

టీచర్‌ని ప్రేమించిన స్టూడెంట్.. చీర కట్టుకుని వచ్చింది.. పెట్రోల్ పోసి నిప్పంటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments