Webdunia - Bharat's app for daily news and videos

Install App

అడగట్లేదు.. అడుక్కోవట్లేదు.. లెస్‌ నాయిస్‌=మోర్‌ సౌండ్‌ : ప్రత్యేక హోదాపై హీరో రామ్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం యువత, విద్యార్థులు చేపట్టిన ఉద్యమానికి సినీ హీరోల మద్దతు పెరుగుతోంది. పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ వెన్నుముకగా నిలువగా, ఇతర సినీ హీరోలు కూడా స్పెషల్‌

Webdunia
గురువారం, 26 జనవరి 2017 (11:21 IST)
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం యువత, విద్యార్థులు చేపట్టిన ఉద్యమానికి సినీ హీరోల మద్దతు పెరుగుతోంది. పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ వెన్నుముకగా నిలువగా, ఇతర సినీ హీరోలు కూడా స్పెషల్‌ స్టేటస్‌ కోసం జరుగనున్న నిరసనకు తమ మద్ధతును తెలియజేశారు.
 
ఈ జాబితాలోకి తాజాగా యంగ్‌ హీరో రామ్‌ చేరాడు. గురువారం సాయంత్రం విశాఖలో జరుగనున్న మౌన పోరాటానికి తన మద్ధతును తెలియజేశాడు. 'డియర్‌ సిస్టర్స్‌ అండ్‌ బ్రదర్స్‌.. అడగట్లేదు.. అడుక్కోవట్లేదు.. ఎదురుచూస్తున్నాం.. లెస్‌ నాయిస్‌=మోర్‌ సౌండ్‌' అని హీరో రామ్‌ ట్వీట్‌ చేశాడు. ఇప్పటికే సాయిధరమ్‌ తేజ్‌, వరుణ్‌తేజ్‌, మనోజ్‌, రాజమౌళి వంటి సినీ ప్రముఖులు స్పెషల్‌ స్టేటస్‌ నిరసనకు మద్ధతు పలికిన విషయం తెలిసిందే.
 
మరోవైపు.. ఏపీకి ప్రత్యేకహోదా కోసం యువత తలపెట్టిన నిరసన కార్యక్రమానికి సినీ హీరో సంపూర్ణేష్ బాబు మద్దతు పలికిన విషయం తెలిసిందే. తెలంగాణ ప్రాంతానకి చెందినవాడినైనా... తెలుగురాష్ట్ర హోదా కోసం తన వంతు కృషి చేస్తానని ఇప్పటికే సంపూ ప్రకటించాడు. ఈ నేపథ్యంలో, గురువారం విశాఖ చేరుకున్నాడు. సంపూకు అక్కడి యువత ఘన స్వాగతం పలికింది. తమ పోరాటానికి అండగా ఉన్నందుకు ధన్యవాదాలు తెలిపింది.
 
ఈ సందర్భంగా సంపూ మాట్లాడుతూ, ప్రాంతాలుగా విడిపోయినప్పటికీ, తెలుగువారంతా ఒక్కటేనని అన్నాడు. హోదా కోసం యువత చేస్తున్న పోరాటానికి ప్రతి ఒక్కరూ మద్దతు పలకాలని కోరాడు. ఆర్కే బీచ్ లో సాయంత్రం జరగబోయే ఆందోళనలో పాల్గొంటున్నానని చెప్పాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

సమాజానికి భయపడి ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments