Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశాన్ని రెండుగా విడగొట్టాలి.. మంచు విష్ణు : హైదరాబాద్‌లో కేసు నమోదు

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ నటుడు డాక్టర్ మోహన్ బాబు తనయుడు, సినీ హీరో మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను నటించిన తాజా చిత్రం "లక్కున్నోడు". ఈ చిత్రం సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగ

Webdunia
గురువారం, 26 జనవరి 2017 (09:53 IST)
తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ నటుడు డాక్టర్ మోహన్ బాబు తనయుడు, సినీ హీరో మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను నటించిన తాజా చిత్రం "లక్కున్నోడు". ఈ చిత్రం సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా విష్ణు మాట్లాడుతూ, శాంతియుత పోరాటం వల్లే స్వాతంత్ర్యం వచ్చిందన్న సంగతిని జల్లికట్టు ఆందోళన గుర్తుచేస్తోందని, దానిని ఆదర్శంగా తీసుకుని మనమందరం రాష్ట్రానికి ప్రత్యేకహోదా తెచ్చేందుకు పోరాడాలని పిలుపునిచ్చాడు. ఆ పోరాటానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన తెలిపాడు.
 
అయితే, దక్షిణాది ప్రజలు నిర్ణయిస్తేనే కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయని, అయినప్పటికీ ఉత్తరాదిన మనవారికి సరైన గుర్తింపు ఉండటం లేదని చెప్పాడు. అలాంటప్పుడు ఒకే దేశంగా ఉండాల్సిన అవసరం ఉందా? అని ప్రశ్నించాడు. అందుకే దేశాన్ని ఉత్తరాది, దక్షిణాది అంటూ రెండు భాగాలుగా విడగొట్టడమే మంచిదని అభిప్రాయపడ్డాడు. 
 
ఈ తరహా వ్యాఖ్యలు చేసినందుకు గాను మంచు విష్ణుపై హైదరాబాద్‌లో కేసు నమోదైంది. నేరేడ్‌మెట్‌కు చెందిన ఆర్‌.మణిరత్నం అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘‘జల్లికట్టు పోరాటం స్ఫూర్తిగా ప్రత్యేకహోదా కోసం పోరాడాలి. దక్షిణాది ప్రజలు నిర్ణయిస్తేనే ఢిల్లీలో ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. కానీ.. మనకు ఉత్తరాది నుంచి సరైన గుర్తింపు రావట్లేదు. అలాంటప్పుడు కలిసి ఉంటే ఏం లాభం? దక్షిణాది, ఉత్తరాది ప్రాంతాలను వేర్వేరు దేశాలుగా విడగొట్టేస్తే బాగుంటుంది’ అంటూ దేశ సమగ్రతని భంగపరిచే వ్యాఖ్యలను విష్ణు చేశారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: శనివారం నుంచి అమలులోకి హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు

కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్-II: ఏపీకి 95 శాతంతో పోల్చితే.. తెలంగాణకు 15శాతం మాత్రమే?

Bridegroom: వివాహానికి ముందు రోజు వేరొక స్త్రీని పెళ్లాడిన వరుడు ఎక్కడ?

పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు.. అలా జరిగితే అదే చివరి రోజట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments