Webdunia - Bharat's app for daily news and videos

Install App

భగవంతుడు అన్యాయం చేశాడు.. శ్రీదేవి చూసి ఎంతో నేర్చుకున్నా: చిరంజీవి

అతిలోకసుందరి శ్రీదేవి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది. శ్రీదేవి మరణవార్త విని షాక్ అయిన మెగాస్టార్ చిరంజీవి.. శ్రీదేవి లాంటి నటి గతంలో ఎవరూ లేరని, భవిష్యత్తులో వస్తారని కూడా తాను భావించడం లేదని తెలిప

Webdunia
ఆదివారం, 25 ఫిబ్రవరి 2018 (13:29 IST)
అతిలోకసుందరి శ్రీదేవి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది. శ్రీదేవి మరణవార్త విని షాక్ అయిన మెగాస్టార్ చిరంజీవి.. శ్రీదేవి లాంటి నటి గతంలో ఎవరూ లేరని, భవిష్యత్తులో వస్తారని కూడా తాను భావించడం లేదని తెలిపారు. అందం, అభినయం కలబోసిన అద్భుతమైన నటి అతిలోక సుందరి అంటూ మెగాస్టార్ చెప్పారు. శ్రీదేవి అంకితభావాన్ని చూసి తాను కూడా ఎంతో నేర్చుకున్నానని స్ఫూర్తి పొందానని చిరంజీవి తెలిపారు.
 
రాణికాసుల రంగమ్మ అనే సినిమా చేశామని.. ఆ తర్వాత రెండు, మూడు సినిమాలు చేసినప్పటికీ... తమ కాంబినేషన్లో వచ్చిన అద్భుతమైన సినిమా ''జగదేకవీరుడు అతిలోకసుందరి'' అని చిరంజీవి తెలిపారు. జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలో దేవత పాత్రలో శ్రీదేవి ఒదిగిపోయిందని... ఆ పాత్ర కోసమే ఆవిడ పుట్టిందా అనిపించిందని చిరంజీవి కొనియాడారు. 
 
సినిమాల పరంగానే కాకుండా, ఆమె కుటుంబానికి మంచి సాన్నిహిత్యం ఉందని చిరంజీవి వెల్లడించారు. తన 60వ పుట్టినరోజు వేడుకకు కూడా శ్రీదేవి, బోనీకపూర్ ఇద్దరూ వచ్చారని, తనకు శుభాకాంక్షలు తెలియజేశారని గుర్తు చేసుకున్నారు. కానీ ఆదివారం ఉదయం ఆమె మరణవార్తను వినగానే షాక్‌కు గురయ్యానని చెప్పుకొచ్చారు. 
 
వాస్తవాన్ని జీర్ణించుకోవడం మొదలు పెట్టాక తన మనసు మనసులో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంత గొప్ప శ్రీదేవిని పోగొట్టుకోవడం అందరి దురదృష్టమని ఆవేదన వ్యక్తం చేశారు. భగవంతుడు చాలా అన్యాయం చేశాడని... మన శ్రీదేవిని మనకు దూరం చేశాడని చెప్పుకొచ్చారు. శ్రీదేవి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Trisha Krishnan ఏదో ఒక రోజు తమిళనాడు ముఖ్యమంత్రిని అవుతా: నటి త్రిష

oyorooms: పెళ్లి కాని జంటలకు ఇక నో రూమ్స్, ఓయో కొత్త చెక్ ఇన్ పాలసీ

మంత్రి పీఏ వసూళ్ల దందా : స్పందించిన హోం మంత్రి అనిత (Video)

నమో భారత్ కారిడార్‌ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

బాత్రూం వెళ్లాలని చెప్పి - డబ్బు - నగలతో ఉడాయించిన వధువు... ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

న్యూరోఫార్మకాలజీ, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్‌లో కెఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలు

తర్వాతి కథనం
Show comments