Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీరామ్ వేణు ను తమ్ముడు రిలీజ్ ఎప్పుడంటూ నిలదీసిన లయ, వర్ష బొల్లమ్మ

దేవీ
సోమవారం, 5 మే 2025 (08:40 IST)
Varsha Bollamma
నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ "తమ్ముడు". ఈ చిత్రంలో లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దర్శకుడు శ్రీరామ్ వేణు పుట్టిన రోజు సందర్భంగా "తమ్ముడు" మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. జూలై 4న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ఓ స్పెషల్ వీడియో క్రియేటివ్ గా, ఎంటర్ టైనింగ్ గా ఉండి ఆకట్టుకుంటోంది.
 
Laya
"తమ్ముడు" మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ డిఫరెంట్ గా ప్లాన్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలో నటించిన వివిధ భాషలకు చెందిన యాక్టర్స్ స్వసిక విజయన్, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ, లయ, బేబి శ్రీరామ్ దీత్య ఒక్కొక్కరుగా డైరెక్టర్ శ్రీరామ్ వేణు దగ్గరకు వస్తారు. వీళ్లు తనకు బర్త్ డే విశెస్ చెప్పేందుకు వచ్చారని శ్రీరామ్ వేణు అనుకోగా...వాళ్లు మాత్రం "తమ్ముడు" సినిమా రిలీజ్ ఎప్పుడు ?, ప్రమోషన్ ఎప్పుడు బిగిన్ చేస్తారు ? అడుగుతారు. సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్న లయ. 'తన పోస్టర్ కూడా రిలీజ్ చేయలేదు, రిలీజ్ డేట్ చెప్పడం లేదు' అని అడుగుతుంది. చివరలో బేబి శ్రీరామ్ దీత్య కూడా 'నేను థర్డ్ క్లాస్ లో ఉన్నప్పుడు మూవీ స్టార్ట్ చేశారు, ఇప్పుడు నేను ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నా, మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడు '? అని అడుగుతుంది. దీంతో డైరెక్టర్ శ్రీరామ్ వేణు వాళ్లకు ఏం చెప్పాలో తెలియక మీకు ఇన్ఫామ్ చేస్తానంటూ పంపిస్తారు. చివరలో ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ శ్రీరామ్ వేణు బర్త్ డే కేక్ కట్ చేయడంతో పాటు జూలై 4న "తమ్ముడు" మూవీ రిలీజ్ అంటూ ప్రకటిస్తారు. మంచి ఫన్ తో డిజైన్ చేసిన ఈ వీడియో క్రియేటివ్ గా ఉండి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది.
 
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థతో హీరో నితిన్, దర్శకుడు శ్రీరామ్ వేణుకు మంచి అనుబంధం ఉంది. హీరో నితిన్ దిల్, శ్రీనివాస కళ్యాణం వంటి మూవీస్ చేయగా..దర్శకుడు శ్రీరామ్ వేణు నాని హీరోగా ఎంసీఏ, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వకీల్ సాబ్ వంటి సూపర్ హిట్ చిత్రాలు రూపొందించారు. ఇప్పుడు ఈ ముగ్గురి కాంబినేషన్ లో "తమ్ముడు" సినిమా వస్తుండటం సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రేక్షకులకు మర్చిపోలేని సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ను "తమ్ముడు" సినిమాతో అందించబోతున్నారు దర్శకుడు శ్రీరామ్ వేణు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించాడు.. నదిలో దూకి పారిపోవాలనుకున్నాడు.. కానీ? (video)

30 నిమిషాల బ్లాక్‌అవుట్ డ్రిల్- పాక్ అలెర్ట్.. రెండు నెలలకు సరిపడా ఆహారం నిల్వ చేసుకోండి

Surgical Strike: ఫహల్గామ్ దాడి- పాకిస్తాన్‌పై మరో సర్జికల్ స్ట్రైక్.. నిజమేనా?

Pahalgam: కొలంబోలో పహల్గామ్ ఉగ్రవాదులు- చెన్నై నుంచి పారిపోయారా?

Jagan helicopter fiasco: జగన్ హెలికాప్టర్ ఇష్యూ- 10 వైకాపా కాంగ్రెస్ నేతలతో పాటు పది మంది అరెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments