Webdunia - Bharat's app for daily news and videos

Install App

అడివి శేష్ G2 కోసం 5 అంతస్తుల లావిష్ గ్లాస్ సెట్

Webdunia
సోమవారం, 11 డిశెంబరు 2023 (15:43 IST)
Adavai sesh
అడివి శేష్ 'G2' ఫస్ట్ లుక్ విడుదలైనప్పటి నుంచే ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి. సినిమా స్కేల్ మరింత పెద్దదిగా కనిపిస్తోంది. బనితా సంధు హీరోయిన్ గా నటిస్తున్న యాక్షన్ స్పై థ్రిల్లర్ ఇప్పుడు సెట్స్ పైకి వెళ్ళింది. G2 షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది.
 
మొదటి దశ నుంచి అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్‌లో 5 అంతస్తుల లావిష్ గ్లాస్ సెట్‌ను నిర్మించారు. క్రిస్ప్ సూట్ ధరించిన అడివి శేష్ అందరిని ఆకట్టుకున్నారు.  
 
'G2'  స్పై థ్రిల్లర్, ఇది సక్సెస్ ఫుల్  గూఢచారి ఫ్రాంచైజీలో నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్. తన దేశం కోసం పోరాడటానికి ఇండియా వెలుపల మిషన్‌లో ఉన్న గూఢచారి కథ ఇది.
 
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై టిజి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్నారు.

సంబంధిత వార్తలు

ఎమ్మెల్యే రాజాసింగ్‌ ముందస్తు అరెస్టు - విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకున్న పోలీసులు

దేవభూమి అనకనందా నదిలో పడిన మినీ బస్సు : 14 మంది మృతి

రుషికొండ ప్యాలెస్ రహస్యం గుట్టు రట్టు... రహస్యంగా విలాస భవనాలు కట్టారు: గంటా (Video)

ఆ రైల్వే డివిజన్ పరిధిలో నెల రోజుల పాటు అనేక రైళ్లు రద్దు!!

ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి మరో చేదు అనుభవం... ఫైలుపై సంతకం చేసేందుకు నిరాకరించిన మంత్రి!!

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments