Webdunia - Bharat's app for daily news and videos

Install App

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

ఠాగూర్
సోమవారం, 17 ఫిబ్రవరి 2025 (11:59 IST)
పలువురు అమ్మాయిలను వేధించడంతో పాటు వారిని నగ్నంగా వీడియోలు తీసినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మస్తాన్ సాయి వల్ల పవిత్రమైన దర్గాకు అపవిత్రత కలుగుతుందని నటి లావణ్య ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు లేఖ రాశారు. లావణ్య తరపున ఆమె న్యాయవాది నాగూర్ బాబు లేఖ రాశార. మస్తాన్ సాయి వల్ల మస్తాన్ బాబా దర్గాకు అపవిత్రత కలుగుతోందని పేర్కొన్నారు. గుంటూరులోని మస్తాన్ దర్గా ధర్మకర్తలుగా మస్తాన్ సాయి కుటుంబ సభ్యులను తొలగించాలని కోరారు. ఈ లేఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గుంటూరు జిల్లా కలెక్టర్, మైనార్టీ సంక్షేమ శాఖకు పంపించారు. 
 
సినీ హీరో రాజ్ తరుణ్, నటి లావణ్యల మధ్య నెలకొన్న వివాదం సినీ పరిశ్రమలో దుమారం రేపిన విషయం తెల్సిందే. ఈ కేసులో మస్తాన్ సాయి నిందితుడుగా ఉన్నారు. ఇప్పటికే సాయిపై మహిళల న్యూడ్ ఫోటోలు తీయడం, అత్యాచారం, డ్రగ్స్ ఇలా అనేక రకాలైన కేసులు నమోదైవున్నాయి. ఈ కేసుల్లో మస్తాన్ సాయిని అరెస్టు చేయగా, పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ వివాదంలో చిక్కుకోవడంతో హీరో రాజ్ తరుణ్ సినీ కెరీర్ నాశనమైన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేలం పాటల్లో నిమ్మకాయకు రూ.5 లక్షల ధర ... ప్రత్యేక ఏంటో తెలుసా?

నీ భార్యను నాకు ఇచ్చేయ్.. పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటా.. భర్తను కోరిన వ్యక్తి.. చివరికి?

Perfume Day 2025: పెర్ఫ్యూమ్‌ డే.. వ్యక్తిగత గుర్తింపు కోసం సిగ్నేచర్ సెంట్‌

ఆన్‌లైన్ బెట్టింగుతో నష్టపోయా, చనిపోతున్నా క్షమించు తమ్ముడూ సెల్ఫీ(video)

కేసీఆర్ పుట్టిన రోజు : ఫ్లెక్సీలను తొలగించండి.. (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments