Webdunia - Bharat's app for daily news and videos

Install App

లావణ్య త్రిపాఠి హ్యాప్తీ బర్త్‌డే చిత్రం ఎంత‌వ‌ర‌కు వ‌చ్చిందంటే!

Webdunia
మంగళవారం, 7 జూన్ 2022 (16:37 IST)
Lavanya Tripathi
‘మత్తువదలరా’ చిత్రంతో దర్శకుడిగా తన ప్రతిభను నిరూపించుకున్న రితేష్‌రానా దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘హ్యాప్తీ బర్త్‌డే’. లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రా న్నిక్లాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ మైత్రీమూవీ మేకర్స్‌ సంస్థతో కలిసి నిర్మిస్తోంది. నవీన్‌ ఎర్నేని,  రవిశంకర్‌ యలమంచిలి  సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నరేష్‌ ఆగస్త్య, సత్య,వెన్నెల కిషోర్‌,గుండు సుదర్శన్‌, తదితరులు ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం జూలై 15న విడుదల కానుంది. 
 
తొలినుంచి ఈ చిత్రం ప్రచార చిత్రాలతో ఆకట్టుకున్న ఈ చిత్రబృందం మంగళవారం చిత్రం టీజర్‌ను విడుదల చేసింది. వినూత్నంగా, పూ ర్తి కామెడీ ప్రధానంగా వున్న ఈ టీజర్‌ అందరిని ఇంప్రెస్‌ చేసింది. యూనియన్‌ మినిష్టర్‌ రోల్‌గా వెన్నెల కిషోర్‌ సంభాషణలు, గన్‌బిల్లును ఆమోదించడం, ఇంటికొక గన్‌ పాలసీని ప్రతిపాదించడం, లావణ్య త్రిపాఠి పోల్‌ డ్యాన్స్‌ , సత్య స్టయిలిష్‌ వాక్‌, వంటి సన్నివేశాలు టీజర్‌లో ఎంతో వినోదాత్మకంగా కనిపించి చిత్రంపై అంచనాలు పెంచాయి. కాలభైరవ తన నేపథ్య సంగీతం, సురేష్‌ సారంగం కెమెరాపనితనం టీజర్‌ను మరింత ఆసక్తిగా కనిపించేలా చేశాయి. ఇది జస్ట్‌ టీజర్‌ మాత్రమే పూర్తి పార్టీ జూలై 15న అనే విధంగా అందరిలోనూ క్యూరియాసిటి పెరిగింది.ఈ చిత్రానికి సంగీతం: కాలభైరవ, ప్రొడక్షన్‌ డిజైనర్‌: నార్ని శ్రీనివాస్‌, ఫైట్స్‌: శంకర్‌ ఉయ్యాలా, లైన్‌ ప్రొడ్యూసర్‌: అలేఖ్య పెదమల్లు, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: బాబాసాయి, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: బాల సుబ్రమణ్యం కెవీవీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం.. రాయలసీమ, ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు

Mumbai Boat Accident: ప్రయాణికుల బోటును నేవీ బోటు ఢీకొట్టడంతో 13 మంది మృతి, పలువురు గల్లంతు (video)

Live accident, గుంటూరు-విజయవాడ హైవేపై పట్టపగలే కారుతో ఢీకొట్టేసాడు (video)

తిరుమల పవిత్రతను కాపాడండి.. పబ్ కల్చర్ వచ్చేసింది.. భూమన కరుణాకర్ రెడ్డి

కేరళలో మళ్ళీ మంకీపాక్స్ కేసులు - ఇద్దరికీ పాజిటివ్ కేసులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పీచు పదార్థం ఎందుకు తినాలి?

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments