Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను క్షేమంగా ఉన్నానంటూ హీరో ధర్మేంద్ర వెల్లడి

Webdunia
మంగళవారం, 7 జూన్ 2022 (09:24 IST)
తన ఆరోగ్యంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర స్పందించారు. తాను క్షేమంగా ఆరోగ్యవంతంగా ఉన్నట్టు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆయన వివరణ ఇచ్చారు. 86 యేళ్ల ధర్మేంద్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిపాలైనట్టు సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. దీన్ని ఆయన ఖండించారు. తాను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నట్టు వివరణ ఇచ్చారు. దయచేసి వదంతులు నమ్మొద్దని ఆయన కోరారు. 
 
పైగా, తాను మౌనంగా ఉన్నాను తప్పితే అనారోగ్యంగా లేనని చమత్కరిచారు. ఇతరులకు ప్రేమను పంచితే జీవితం అందంగా ఉంటుందన్న ధర్మేంద్ర.. తన ఆరోగ్యం గురించి వస్తున్న వదంతులను నమ్మొద్దని హితవు పలికారు. అలాగే, తన తండ్రి ఆరోగ్యంపై సాగుతున్న ప్రచారాన్ని కూడా ఆయన కుమారుడు బాబీ డియోల్ ఖండించారు. 
 
నిజానికి నెల రోజుల క్రితం ధర్మేంద్ర రొటీన్ చెకప్‌లలో భాగంగా, ముంబైలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆ తర్వాత ఆయన ఆస్పత్రికి ఎందుకు వెళ్లారో కూడా ట్విట్టర్ ఖాతాలో వివరించారు. నడుం నొప్పి ఉండటంతో ఆస్పత్రికి వెళ్లానని, అందువల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. కానీ, ఇపుడు ఆయన ఆరోగ్యంపై వందతులు ప్రసారమవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments