Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో రాజ్ తరుణ్ బంగారం దొంగిలించారు : లావణ్య ఫిర్యాదు!

ఠాగూర్
మంగళవారం, 10 సెప్టెంబరు 2024 (16:26 IST)
హీరో రాజ్ తరుణ్‌పై ఆయన మాజీ ప్రియురాలు లావణ్య చోరీ కేసు పెట్టింది. రాజ్ కిరణ్ బంగారాన్ని చోరీ చేశాడంటూ ఆరోపించింది. తన బంగారం, మంగళసూత్రం, దొంగిలించినట్టు ఆమె హైదరాబాద్ నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు తాను కొనుగోలు చేసిన జ్యూవెలరీ షాప్ బిల్లులను కూడా సాక్ష్యాధారాలుగా చూపించారు. 
 
తన బంగారు నగలను బీరువాలో దాచానని, వాటి తాళం చెవిలు రాజ్ తరుణ్ వద్ద ఉందని ఫిర్యాదులో పేర్కొంది. తనకు తెలియకుండానే బీరావాలోని బంగారం దొంగిలించాడని తెలిపింది. ఇందుకు సంబంధించి ఆధారాలు కూడా సమర్పిస్తున్నట్టు తెలిపింది. రాజ్ తరుణ్ దొంగతనం చేసిన బంగారం విలువ రూ.12 లక్షల వరకు ఉంటుందని పేర్కొంది. 
 
రాజ్ తరుణ్ తనను మోసం చేశాడంటూ లావణ్య గతంలోనే నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఇపుడు హీరోయిన్ మాల్వీ మల్హోత్రాతో ఉంటున్నాడంటూ ఆమె గతంలో చేసిన ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు తయారు చేసిన చార్జిషీటులో రాజ్ తరుణ్ తప్పు చేసినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే, ఈ కేసులో రాజ్ తరుణ్ కోర్టును ఆశ్రయించి తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ పొందిన విషయం తెల్సిందే. ఈ కేసు కొనసాగుతుండగా మరోవైపు, చోరీ కేసు పెట్టడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

తిరుపతి-పళనిల మధ్య ఆర్టీసీ సేవలను ప్రారంభించిన పవన్ కల్యాణ్

కొండపై గెస్ట్ హౌస్ సీజ్.. కేతిరెడ్డికి అలా షాకిచ్చిన రెవెన్యూ అధికారులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments