Webdunia - Bharat's app for daily news and videos

Install App

జెమిని స‌మ‌ర్ప‌ణ‌లో బ‌హుభాషా చిత్రం రేంజ్‌ ప్రారంభం

Webdunia
బుధవారం, 8 సెప్టెంబరు 2021 (17:00 IST)
Range team with poster
జెమిని ప్రొడక్షన్ యువ ప్రతిభను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో కొన్ని ఆసక్తికరమైన కంటెంట్-ఆధారిత సినిమాలను రూపొందించడానికి స‌మాయుక్త‌మైంది, అందులో భాగంగా  సినీ ప్రేక్షకులకు కొత్త కంటెంట్‌ను అందించడానికి ప్రణాళికలు ర‌చిస్తోంది. ఈ రోజు వారి కొత్త ప్రొడ‌క్ష‌న్ ను ప్ర‌క‌టించారు. భవిష్యత్తు మ‌రిన్ని వెంచ‌ర్‌ల‌ను ప్ర‌క‌టించనున్నారు.
 
తెలుగు, తమిళం, మలయాళం కన్నడ భాషలలో బహుభాషా ప్రాజెక్ట్ గా రూపొందుతున్న ఈ డిఫ‌రెంట్‌ యాక్షన్ ఎంటర్టైనర్ రేంజ్ లో హీరో చైతన్య వంశీ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
 
జెమిని స‌మ‌ర్ప‌ణ‌లో య‌శ్విత ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై గుడాల న‌వీన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  హేమంత్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్న ఈ మూవీ ఈ రోజు పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. ముహూర్త‌పు స‌న్నివేశానికి జెమిని సీఈఓ పీవీఆర్ మూర్తి క్లాప్ నిచ్చారు.
 
ఈ చిత్రానికి `రేంజ్` అనే టైటిల్ తో పాటు ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు మేక‌ర్స్‌. ఈ పోస్ట‌ర్‌లో వంశీ ర‌క్తంలో త‌డిసి యాక్ష‌న్ అవ‌తారంలో కనిపిస్తున్నారు. అతడి చేతిలో చైన్ సా( chain saw)ని మ‌నం చూడొచ్చు. రేంజ్ అనే  టైటిల్ ఆస‌క్తిక‌రంగా ఉండ‌డంతో పాటు ఈ సినిమా ఒక హై ఇంటెన్స్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ అని అర్ధ‌మ‌వుతోంది.
 
శక్తికాంత్ కార్తీక్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, లక్ష్మీకాంతం కనికే బి.ఎఫ్ఎ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. గౌతం రాజు ఎడిటర్. ఈ సినిమా షూటింగ్ నవంబర్ చివరి వారం నుండి ప్రారంభమవుతుంది. ఇందులో కొందరు ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆంధ్రా ప్రజలకు మండుతుంది.. జగన్ పేర్లు తొలగిపోతున్నాయ్...

అన్నదాత సుఖీభవగా పేరు మార్చుకున్న రైతు భరోసా పథకం

తెలంగాణలో ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం- హై అలెర్ట్

తిరుమల: సర్వదర్శనానికి 16 గంటలు.. హుండీ ఆదాయం రూ.4.01 కోట్లు

ఆసక్తికర విషయాన్ని వెల్లడించిన సుధా నారాయణ మూర్తి.. కలాం ఫోన్ చేస్తే రాంగ్ నంబర్ అని చెప్పా...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments