Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

చిత్రాసేన్
శుక్రవారం, 17 అక్టోబరు 2025 (19:31 IST)
Peddi - Ramchara latest Pic
రామ్‌చరణ్‌, జాన్వీ కపూర్‌ జంటగా నటిస్తున్న పెద్ది సినిమాలోని పాటలను ఇటీవలే చిత్రీకరించారు. ఉప్పెన ఫేమ్‌ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో  రూపొందుతోంది. మూడు రోజుల్లో దీపావళి రాబోతుండగా అభిమానులకు శుభవార్త ఇవ్వనుంది చిత్ర యూనిట్. దసరాకు వస్తుందనుకున్న ఫస్ట్‌ సింగిల్‌ రాకపోవడంతో ఫ్యాన్స్‌ కాస్త నిరాశ చెందారు. అయితే దర్శకుడు బుచ్చిబాబు దీపావళికి దద్దరిలే అప్‌డేట్‌ ఇచ్చారు. 
 
ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం సమకూరుస్తున్న ఈ పాట పెద్ద క్రేజ్ తెస్తుందని దర్శకుడు తెలియజేస్తున్నారు. స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే మాస్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. రామ్ చరణ్ గెటప్ కూడా రంగస్థలం ఫార్మెట్ వున్నట్లు కనిపించినా సరికొత్తగా వుంటుంది. ఇటీవలే కొండలు అద్భుతమైన ప్రాంతంలో పాటను చిత్రీకరించారు. ఎత్తైయిన ప్రదేశాల్లో రామ్ చరణ్ తన టీమ్ తో ఎక్కుతున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దానితోపాటు చిన్న క్లిప్ ను కూడా విడుదలచేశారు. 
 
తాజా అప్ డేట్ చెప్పాలంటే... కథ ప్రకారంగా శ్రీలంక వెళుతున్నారు. అక్కడ కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. దీపావళి తర్వాత చిత్ర యూనిట్ వెళ్లనుంది. ఇప్పటికే లొకేషన్లను దర్శకుడు బుజ్జిబాబు చూసి వచ్చారు. అనంతరం నవంబర్ లో తిరిగి హైదరాబాద్ లో వేసిన సెట్లో చిత్రీకరించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Wedding: భాంగ్రా నృత్యం చేస్తూ వధువు మృతి.. పెళ్లికి కొన్ని గంటలకు ముందే...?

కాలేజీ స్టూడెంట్‌పై యాసిడ్ దాడి.. చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలు..

First State Butterfly: రాష్ట్ర నీలి సీతాకోకచిలుకగా తిరుమల లిమ్నియాస్..

తాడుతో భర్త మెడను బిగించి ఊపిరాడకుండా చేసింది.. ఆపై కర్రతో తలపై కొట్టి చంపేసింది..

తిరుమలలో భారీ వర్షాలు.. పూర్తిగా నిండిపోయిన పాపవినాశనం, గోగర్భం జలాశయాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments