తన తల్లి శ్రీదేవి, తాను మలయాళీ కాదని బాలీవుడ్ నటి శ్రీదేవి అన్నారు. అయితే, కేరళ సంస్కృతీ సంప్రదాయాల పట్ల తాము ఎంతో ఆసక్తి చూపిస్తానని తెలిపారు. జాన్వీ నటించిన తాజా రొమాంటిక్ కామెడీ మూవీ 'పరమ్ సుందరి'. ఈ సినిమా ట్రైలర్ విడుదల అనంతరం జాన్వీపై నెట్టింట ట్రోల్స్ వచ్చాయి. ఉత్తరాదికి చెందిన ఆమెను మలయాళ యువతిగా చూపించడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. కేరళ బ్యాక్ డ్రాప్ చిత్రంలో నటించేందుకు మలయాళ హీరోయిన్స్ లేరా? అంటూ గాయని పవిత్రా మేనన్ వంటి వారు ప్రశ్నించారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో జాన్వీ వాటిపై స్పందించారు.
"అవును నేను మలయాళ అమ్మాయిని కాదు. మా అమ్మ (శ్రీదేవి) కూడా మలయాళీ కాదు. కానీ, కేరళ సంస్కృతి పట్ల నేనెప్పుడూ ఆసక్తి చూపిస్తా. ముఖ్యంగా మలయాళ సినిమాలకు నేను అభిమానిని. 'పరమ్ సుందరి'లో నేను మలయాళ అమ్మాయిగానే కాదు తమిళ అమ్మాయిగానూ కనిపిస్తా. ఇది వినోదాత్మక కథ. ఈ సినిమాలో భాగం కావడం ఆనందంగా ఉంది" అని జాన్వీ పేర్కొన్నారు.
కేరళ యువతి, ఢిల్లీ యువకుడి ప్రేమకథే ఈ 'పరమ్ సుందరి'. సిద్ధార్థ్ మల్హోత్రా హీరో. సుందరి దామోదరం పిళ్లైగా జాన్వీ, పరమ్ సల్దేవ్ సిద్ధార్థ్ నటించారు. తుషార్ జలోటా దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. "కేరళ.. మలయాళం మోహన్ లాల్, తమిళనాడు.. తమిళ్ రజనీకాంత్, ఆంధ్ర.. తెలుగు అల్లు అర్జున్, కర్ణాటక.. కన్నడ యష్" అంటూ జాన్వీ చెప్పిన డైలాగులు ఈ చిత్రంలో హైలెట్‌గా నిలిచాయి.