Webdunia - Bharat's app for daily news and videos

Install App

మలయాళ నిర్మాత అజయ్ క్రిష్ణన్ ప్రియురాలి ఆత్మహత్య

Webdunia
శుక్రవారం, 6 మే 2016 (13:38 IST)
కోటి ఆశలతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన నిర్మాత అజయ్ క్రిష్ణన్. అతని జీవితం అర్థాంతంగా ముగిసింది. గత నెల ఏప్రిల్ 25న ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదాన్ని మరువక ముందే మరో విషాదం కూడా చోటుచేసుకుంది. అజయ్ క్రిష్ణన్ ప్రియురాలు వినితా నాయర్ కూడా ఆత్మహత్య చేసుకుంది. అజయ్ క్రిష్ణన్ మృతిని తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడింది. ఆమె సూసైడ్ నోట్‌లో తన చావుకు ఎవరూ కారణం కాదని వెల్లడించారు. 
 
పూర్తి వివరాలను పరిశీలిస్తే అజయ్ క్రిష్ణన్ తన ఆస్థిని అమ్మీ కొన్ని చోట్ల అప్పులు చేసి మరీ ''అవరుడే రవుకల్'' అనే ఒక సినిమాను తీశాడు. ఎంతో కష్టపడి తీసిన సినిమా ప్రివ్యూను చూసి… ఇప్పటివరకు తాను పెట్టిన డబ్బు వృధా అని, ఈ సినిమా హిట్ అవ్వదని భావించి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతని మరణాన్ని జీర్ణించుకోలేని ప్రియురాలు వినీతా నాయర్ మంగళవారం తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 
 
ఎస్ఐ సతీష్ కుమార్ ఈ కేసు విషయమై పోలీసులతో మాట్లాడుతూ... వినీత నాయర్ సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నామని, అందులో తన చావుకు ఎవరూ కారణం కాదని రాసి ఉందని తెలిపారు. బెంగుళూరులో ఫ్యాషన్ డిజైనిగ్ కోర్సు పూర్తి చేసిన వినీతా నాయర్ జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు. అజయ్ లేడన్నబాధతోనే తాను ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె సూసైడ్ నోట్‌లో పేర్కొంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

రానున్నది వైకాపా ప్రభుత్వమే.. నీతో జైలు ఊచలు లెక్కపెట్టిస్తా... ఎస్ఐకు వైకాపా నేత వార్నింగ్

మద్యం స్కామ్‌లో మాజీ ముఖ్యమంత్రి కుమారుడి అరెస్టు

తప్పిపోయిన కుక్క, డ్రోన్ కెమేరాతో వెతికి చూసి షాక్ తిన్నారు (video)

మిథున్ రెడ్డికి షాకిచ్చిన సుప్రీంకోర్టు... సరెండర్‌కు కూడా నో టైమ్..

Hyderabad: పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారం చేశాడు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments