Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగిసిన ఎస్పీబీ శకం : వ్యవసాయక్షేత్రంలో సేదతీరిన గానగంధర్వుడు

Webdunia
శనివారం, 26 సెప్టెంబరు 2020 (12:42 IST)
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు చెన్నై సమీపంలో ఉన్న ఆయన వ్యవసాయక్షేత్రంలో ప్రభుత్వ లాంఛనాల మధ్య శనివారం మధ్యాహ్నం పూర్తయ్యాయి. ఆయనకు ఇష్టంగా నిర్మించుకున్న వ్యవసాయక్షేత్రంలో ఈ అంత్యక్రియలు ముగిశాయి. ఎస్బీబీ పార్థివదేహాన్ని సినీ ప్రముఖులు దర్శించుకున్నారు.
 
చెన్నై శివారులోని తామరైపాక్కం వ్యవసాయ క్షేత్రానికి వచ్చిన పలువురు ప్రముఖులు ఆయనను కడసారి చూసుకున్నారు. సినీ ప్రముఖులు భారతీరాజాతో పాటు దేవిశ్రీ ప్రసాద్‌, శివబాలాజీ, మనో తదితరులు బాలు భౌతిక కాయాన్ని కడసారి చూసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యుల సమక్షంలో అంతిమ సంస్కారాలు జరుగుతున్నాయి.
 
అలాగే, తమిళ హీరో విజయ్ కూడా చివరి క్షణంలో అక్కడకు వచ్చారు. బాలు భౌతికకాయాన్ని చూసి చలించిపోయారు. ఆయన పార్థివదేహానికి నమస్కరించి అంజలి ఘటించారు. పక్కనే ఉన్న బాలు కుమారుడు ఎస్పీ చరణ్‌ని సముదాయించారు. మరోవైపు ఫాంహౌస్ వద్దకు అభిమానులు పోటెత్తుతున్నప్పటికీ... కరోనా నేపథ్యంలో ఫాంహౌస్‌లోకి అందరినీ పోలీసులు అనుమతించడం లేదు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments