Webdunia - Bharat's app for daily news and videos

Install App

లక్ష్మీస్‌ వీరగ్రంథం యూనిట్‌కు చుక్కెదురు..

'లక్ష్మీస్‌ వీరగ్రంథం' సినిమా షూటింగ్‌కు ఆదిలోనే దెబ్బతగిలింది. ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో సన్నివేశాల చిత్రీకరణకు ప్రయత్నించిన యూనిట్‌కు గ్రామ పంచాయతీ చుక్కలు చూపించింది. లక్ష్మీస్ వీరగ్రంథం సినిమ

Webdunia
మంగళవారం, 14 నవంబరు 2017 (09:34 IST)
'లక్ష్మీస్‌ వీరగ్రంథం' సినిమా షూటింగ్‌కు ఆదిలోనే దెబ్బతగిలింది. ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో సన్నివేశాల చిత్రీకరణకు ప్రయత్నించిన యూనిట్‌కు గ్రామ పంచాయతీ చుక్కలు చూపించింది. లక్ష్మీస్ వీరగ్రంథం సినిమాకు అడ్డంకులు తప్పడం లేదు. ఈ సినిమా ముహూర్తం సన్నివేశాన్ని హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద చిత్రీకరించేందుకు ఇటీవల చిత్ర బృందం ప్రయత్నించింది. అయితే, దీనిని పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. 
 
అనంతరం ఈ చిత్రయూనిట్ ఎన్టీఆర్ స్వస్థలమైన కృష్ణా జిల్లా పామర్రు మండలంలోని నిమ్మకూరులో జరిపేందుకు చేసిన ప్రయత్నాలను ఆ గ్రామవాసులు అడ్డుకున్నారు. ఎన్టీఆర్‌కు సంబంధించిన కొన్ని సన్నివేశాలు చిత్రీకరించేందుకు పంచాయతీ పెద్దలను ఈ సినిమా దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఆశ్రయించారు. సన్నివేశాల చిత్రీకరణకు అనుమతి ఇవ్వాలని కోరారు. దీంతో సమావేశమైన పంచాయతీ పాలకవర్గం, గ్రామపెద్దలు చిత్రీకరణకు అభ్యంతరం తెలిపారు. 
 
ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్‌తో పాటు నిమ్మకూరుకు కూడా చెడ్డపేరు వస్తుందని.. అందుకే అనుమని ఇవ్వలేమని స్పష్టం చేశారు. దీంతో గ్రామస్థులకు ఇష్టం లేకుండా సన్నివేశాలు చిత్రీకరించమని చెప్తూ సినీ యూనిట్ ఎన్టీఆర్ కాంస్య విగ్రహానికి పూలమాలలు చేసి.. నివాళులు అర్పించి వెనుదిరిగారు.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments