Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నా భర్త పరువు తీస్తే ఊరుకోబోను... లక్ష్మీ పార్వతి హెచ్చరిక

లక్ష్మీస్ వీరగ్రంథం పేరుతో తన జీవిత చరిత్రను తెరకెక్కించి తన భర్త పరువు తీస్తే మాత్రం సహించే ప్రసక్తే లేదని లక్ష్మీ పార్వతి హెచ్చరించారు. 'లక్ష్మీస్ వీరగ్రంథం' పేరిట ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు

Advertiesment
నా భర్త పరువు తీస్తే ఊరుకోబోను... లక్ష్మీ పార్వతి హెచ్చరిక
, గురువారం, 26 అక్టోబరు 2017 (10:09 IST)
లక్ష్మీస్ వీరగ్రంథం పేరుతో తన జీవిత చరిత్రను తెరకెక్కించి తన భర్త పరువు తీస్తే మాత్రం సహించే ప్రసక్తే లేదని లక్ష్మీ పార్వతి హెచ్చరించారు. 'లక్ష్మీస్ వీరగ్రంథం' పేరిట ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ప్రకటించారు. లక్ష్మీపార్వతి తన మొదటి భర్త వీరగంధం సుబ్బారావును వీడి ఎన్టీఆర్ జీవితంలోకి ఎలా ప్రవేశించిందనే విషయాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను తాజాగా రిలీజ్ చేశారు. 
 
దీనిపై లక్ష్మీ పార్వతి స్పందించారు. తన పరువు తీయాలని చూస్తూ కొంతమంది ప్రయత్నిస్తున్నారని, వారిని చూసి తన మనసు బాధపడుతోందన్నారు. తనను రచ్చకీడ్చాలని భావిస్తున్న కొందరు, ఉన్నవి లేనివి కల్పించి సినిమాలు తీద్దామని భావిస్తున్నారని, వారి ప్రయత్నాన్ని తన ప్రాణం అడ్డుపెట్టయినా అడ్డుకుంటానన్నారు. రెండు రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు తన మనసును కలచివేస్తున్నాయని కన్నీరు పెట్టుకున్న లక్ష్మీ పార్వతి, ఉపశమనం కోసం తన భర్త వద్దకు వచ్చానని అన్నారు. 
 
తనను ఇబ్బంది పెట్టినా భరిస్తానని, తన భర్త పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లితే మాత్రం చూస్తూ ఊరుకోబోనని హెచ్చరించారు. కేతిరెడ్డి సినిమాకు తన అనుమతి తప్పనిసరని, అనుమతి లేకుండా తీసే చిత్రం చెల్లబోదని స్పష్టం చేశారు. అంతకుముందు ఆమె హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌కు గురువారం ఉదయం చేరుకుని కొద్దిసేపు మౌనదీక్ష చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్రికెటర్లతో డేటింగ్ చేయమని సలహా ఇచ్చారు : రిచా చద్దా