Webdunia - Bharat's app for daily news and videos

Install App

'లక్ష్మీస్ ఎన్టీఆర్' కలెక్షన్ల వర్షం... చిన్నబోయిన బాలయ్య

Webdunia
మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (09:57 IST)
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ నిర్మించిన చిత్రం "లక్ష్మీస్ ఎన్టీఆర్". ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మినహా ప్రపంచ వ్యాప్తంగా గత నెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం తొలి ఆట నుంచే మంచి టాక్‌ను సొంతం చేసుకోవడమేకాకుండా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. నిజానికి రాంగోపాల్ వర్మ ప్రస్తుతం ఫామ్‌లో లేడు, పైగా ఈ చిత్రంలో అందరూ కొత్త నటీనటులు అయినప్పటికీ ఈ సినిమా చుట్టూ ఉన్న వివాదాల వల్ల ప్రేక్షకులు కూడా ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. 
 
కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా, ఓవర్సీస్‌లో కూడా దుమ్మురేపుతోంది. ఈ చిత్రం ఓవర్సీస్‌లో ఇప్పటికే ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని మించిపోయింది. ఓ ఓవర్సీస్‌లో 'ఎన్టీఆర్ మహానాయకుడు' సినిమా రెండు రోజుల్లో 2,16,458 డాలర్లు వసూలు చేయగా, కానీ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' మాత్రం 2,18,700 డాలర్లు వసూలు చేసింది. ఇదే ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 
 
నిజానికి ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన 'కథానాయకుడు', 'మహానాయకుడు' చిత్రాలపై ప్రేక్షకులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. దీనికి కారణం అగ్రహీరో బాలకృష్ణ  నటిస్తుండటం, క్రిష్ దర్శకత్వం వహించడమే. పైగా, అనేక మంది అగ్రహీరోహీరోయిన్లు వివిధ రకాల పాత్రలను పోషించారు. కానీ ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. అటు కలెక్షన్ల పరంగా కూడా పూర్తిగా నిరాశపరిచాయి. ఇపుడు 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తుండటంతో బాలకృష్ణ చిన్నబోయినట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments